పంచాయతీ ఎన్నికలు.. ఎంపీ అవినాశ్‌రెడ్డిపై నిఘా పెట్టిన పోలీసులు
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:09 AM
కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై పులివెందుల పోలీసులు నిఘా పెట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఆయన తిరిగితే గొడవలు జరుగుతాయని నిఘా ఉంచారు.
కడప జిల్లా, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): వైసీపీ కడప ఎంపీ అవినాశ్‌రెడ్డిపై (YCP MP Avinash Reddy) పులివెందుల పోలీసులు నిఘా పెట్టారు. గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో ఆయన తిరిగితే గొడవలు జరుగుతాయని నిఘా ఉంచారు. పాత కేసుల్లో కొందరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారని వదిలిపెట్టాలని ఎంపీ అవినాశ్‌రెడ్డి కోరారు. ఆయన కోరిక మేరకు అదుపులోకి తీసుకున్న వారిని పోలీసులు వదిలేశారు.
పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు
మరోవైపు, పులివెందుల నియోజకవర్గంలో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల వైసీపీ, టీడీపీ పార్టీల్లోని నేతలు ఘర్షణలకు దిగారు. చక్రాయపేట మండలం సురభి నాగులగుట్టపల్లిలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. వేముల మండల కేంద్రంలో వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణ పడ్డారు. అలాగే, వేంపల్లెలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. ఈ క్రమంలోనే వైసీపీ నేత సతీశ్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రేణులు పెద్దఎత్తున తరలి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవడంతో ఫ్యాన్ పార్టీ కేడర్ ఆందోళనకు దిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు
బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News