Share News

ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్.. 145 కి.మీ వేగంతో బలమైన గాలులు..!

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:58 AM

అక్వాన్ తుపాను నెమ్మదిగా కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదలుతోందని తెలిపారు.

ఏపీ వైపు దూసుకొస్తున్న అక్వాన్.. 145 కి.మీ వేగంతో బలమైన గాలులు..!
Cyclone Aqwan Latest Update

అమరావతి, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): అక్వాన్ తుపాను నెమ్మదిగా కదులుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈవో ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 3 కిలోమీటర్ల వేగంతో కదలుతోందని తెలిపారు. ఈరోజు (బుధవారం) ఉదయానికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. చెన్నైకు 590 కిలోమీటర్లు, మచిలీపట్నానికి 620 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 620 కిలోమీటర్లు, ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 750 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వివరించారు. పశ్చిమ - వాయవ్య దిశలో ప్రయాణిస్తూ రేపు (గురువారం) సాయంత్రానికి అతి తీవ్ర తుపానుగా బలపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు.


శుక్రవారం మధ్యాహ్నానికి నెల్లూరు - విశాఖపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ తెలిపారు. తుపాను తీరం దాటే సమయంలో గంటకు 120 నుంచి130 కిలోమీటర్లు, గరిష్ఠంగా 145 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు. రేపు (గురువారం), ఎల్లుండి (శుక్రవారం) అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కోస్తా తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుపాను ప్రభావిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు వాతావరణ హెచ్చరికలు పంపాలి: సీఎం చంద్రబాబు

బంగాళాఖాతంలో బలపడుతున్న అక్వాన్.. ఏపీలో భారీ వర్షాలు..!

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌‌తో భేటీ కానున్న సీఎం చంద్రబాబు.. ఏపీ సమస్యలపై చర్చ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 18 , 2026 | 07:36 AM