Share News

ప్రకాశం జిల్లాలో ప్రమాదం.. విచారం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు

ABN , Publish Date - Nov 21 , 2026 | 09:00 AM

ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రకాశం జిల్లాలో ప్రమాదం.. విచారం వ్యక్తం చేసిన ఏపీ మంత్రులు
Prakasam District Road Accident

ప్రకాశం జిల్లా, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని పెళ్లూరు వద్ద రోడ్డుప్రమాదంలో నలుగురు మృతిచెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు మంత్రులు ఓ ప్రకటన విడుదల చేశారు.


మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది: హోం మంత్రి అనిత

ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై హోం మంత్రి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పెళ్లి వేడుకకు హాజరై తిరిగి వస్తున్న బృందం ప్రమాదానికి గురికావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ దుర్ఘటనలో పలువురు మృతిచెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి కుటుంబాలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు సూచించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు హోం మంత్రి అనిత ఆదేశించారు.


ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడం బాధకరం: మంత్రి గొట్టిపాటి

ప్రకాశం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై మంత్రి గొట్టిపాటి రవికుమార్ విచారం వ్యక్తం చేశారు. పెళ్లూరు సమీపంలో కల్వర్టును ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందడం బాధకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడారు. తిరుపతి నుంచి బాపట్ల వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని అధికారులు తెలిపారు. క్షతగాత్రులను ఒంగోలు రిమ్స్‌కు తరలించి వైద్యం అందిస్తున్నట్లు అధికారులు వివరించారు.


ఈ ప్రమాదంపై మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం

Mandipalli Ramprasad Reddy

ప్రకాశం జిల్లాల్లో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఏపీ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. పెళ్లి వేడుకకు వెళ్లి వస్తున్న బృందం ఈ ఘటనకు గురికావడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందడంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నూతన వధూవరులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య చికిత్స అందించాలని సూచించారు. ప్రయాణ సమయంలో వాహనదారులు తప్పనిసరిగా రహదారి భద్రతా నియమాలు పాటించాలని అన్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఆదేశించారు.


ఈ ఘటన తీవ్రంగా కలచివేసింది :మంత్రి అచ్చెన్నాయుడు

kinjaar.jpg

ప్రకాశం జిల్లా పెళ్లూరు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై నలుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని అన్నారు. సంతోషంగా సాగాల్సిన పెళ్లి ప్రయాణంలో ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం తీవ్రంగా కలచివేసిందని చెప్పారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ప్రవీణ్, వెంకట్రావు, సుజాత, సీతామహాలక్ష్మి మృతి పట్ల ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. రోడ్డు ప్రయాణాల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, అలసటతో లేదా నిద్రమత్తులో వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని, బాధిత కుటుంబాలకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి: ఎంపీ శ్రీభరత్

పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 10:17 AM