స్థానిక ఎన్నికల్లో 90 శాతం పైగా కూటమి స్ట్రైక్ రేట్ సాధించాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:25 PM
జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం పైగా స్ట్రైక్ రేట్ కూటమి పార్టీలకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల కంటే.. స్థానిక ఎన్నికల్లో కూటమికి ఓటింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు.
అమరావతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతంపైగా స్ట్రైక్‌రేట్ కూటమి పార్టీలకు వచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. 2024 ఎన్నికల కంటే.. స్థానిక ఎన్నికల్లో కూటమికి ఓటింగ్ శాతం పెరిగిందని పేర్కొన్నారు. ఈరోజు (శనివారం) ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో విజయం అందించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండేళ్ల పాలనకు ప్రజలు ఇచ్చిన మద్దతు ఇదని చెప్పారు.
వైసీపీ ఓటింగ్ శాతం తగ్గింది..
ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్, బ్యాలెట్ పేపర్ అయినా కూటమిదే గెలుపు అని సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ ఓటింగ్ శాతం 2024 కంటే తగ్గిందని ప్రస్తావించారు. కూటమిలో సీట్ల సర్దుబాటుపై తాను ప్రత్యేకంగా శ్రద్ధపెట్టానని వివరించారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి స్థానంలో కూటమి గెలవాలని అందరం కోరుకున్నామని తెలిపారు. అప్పుడే కూటమి పటిష్ఠంగా ఉంటుందనేది తన అభిప్రాయమని పేర్కొన్నారు.
అభ్యర్థుల ఎంపికపై చాలా కసరత్తు చేశాం..
స్థానిక ఎన్నికల్లో సామాజిక న్యాయం కోసం ప్రయత్నం చేశామని సీఎం వెల్లడించారు. అభ్యర్థుల ఎంపికపై చాలా కసరత్తు చేశామని తెలిపారు. చదువు, ప్రవర్తన, పార్టీ పట్ల అంకితభావం, విధేయత కూడా పరిగణనలోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. తమ వద్ద ఉన్న డేటా ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేశామని వివరించారు. కార్యకర్తే అధినేత... కార్యకర్త లేకపోతే నాయకులు లేరని స్పష్టం చేశారు. బీసీలు ఎప్పటినుంచో టీడీపీకి అండగా ఉన్నారని.. కష్టంలో కూడా పార్టీకి తోడుగా నిలిచారని తెలిపారు.
రాజ్యాధికారంలో స్థానం కల్పించాం..
అందువల్లే వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని ముఖ్యమంత్రి అన్నారు. జనాభా ప్రాతిపదికన ఆయా వర్గాలకు రాజ్యాధికారంలో స్థానం కల్పించామని చెప్పుకొచ్చారు. అందుకే ఒక ఎంపీటీసీని ఎంపీగా చేశామని తెలిపారు. పల్నాడులో కూడా జడ్పీ ఛైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో కూడా సామాజిక న్యాయం కోసం ప్రయత్నం చేశామని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో జనరల్ స్థానంలో ఎస్సీ మహిళతో పోటీ చేయించామని.. ఆమెకు జడ్పీ ఛైర్మన్ ఇచ్చామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా పరిషత్ ఛైర్మన్ కోట పుల్లమ్మ ఏంటెక్ చదువుకున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి: ఎంపీ శ్రీభరత్
పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి
ఇండియన్ రోడ్ నెట్వర్క్ ప్రపంచంలోనే నంబర్‌వన్: నితిన్ గడ్కరీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News