Share News

స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిని.. బొత్స జీర్ణించుకోలేకపోతున్నారు: చిన్న శ్రీను

ABN , Publish Date - Nov 21 , 2026 | 11:54 AM

మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణపై జడ్పీ మాజీ ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత చిన్న శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపైన బొత్స ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిని.. బొత్స జీర్ణించుకోలేకపోతున్నారు: చిన్న శ్రీను
Chinna Srinu

విజయనగరం, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, వైసీపీ కీలక నేత బొత్స సత్యనారాయణపై (Botsa Satyanarayana) జడ్పీ మాజీ ఛైర్మన్, తెలుగుదేశం పార్టీ నేత చిన్న శ్రీను (Chinna Srinu) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లపైన బొత్స ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు (శనివారం) విజయనగరం జిల్లా వేదికగా చిన్న శ్రీను మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ ఓటమిని జీర్ణించుకోలేక ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు.


ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక ఎన్నికలు..

ప్రజాస్వామ్యబద్ధంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని చిన్న శ్రీను స్పష్టం చేశారు. బీసీలపై ప్రేమ వలకబోస్తున్న బొత్స.. నగరపాలక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఎందుకు టిక్కెట్ ఇవ్వలేదని ప్రశ్నించారు. బొబ్బిలి మున్సిపాలిటీలో ఎందుకు బీసీలకు టిక్కెట్ ఇవ్వలేకపోయారని నిలదీశారు. చట్టాలు, న్యాయస్థానంపై వైసీపీకి గౌరవం లేదని దుయ్యబట్టారు. వెనకబడిన వర్గాలపై ఆయనకు ప్రేమ ఉందో, లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీల కోసమే టీడీపీ పుట్టిందని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలోనే తాము పని చేస్తున్నామని చిన్న శ్రీను పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

అంతర్జాతీయ ప్రమాణాలతో విశాఖ రైల్వేస్టేషన్ అభివృద్ధి: ఎంపీ శ్రీభరత్

పులివెందులలో వైసీపీ రాజకీయ డ్రామాలకు కాలం చెల్లింది: బీటెక్ రవి

ఇండియన్ రోడ్ నెట్‌వర్క్‌ ప్రపంచంలోనే నంబర్‌వన్‌: నితిన్‌ గడ్కరీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 21 , 2026 | 12:35 PM