Share News

ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..

ABN , Publish Date - Nov 22 , 2026 | 04:32 PM

ఏపీలోని 100 పట్టణ స్థానిక సంస్థల నూతన పాలకవర్గాల తొలి సమావేశాలు రేపు (నవంబర్ 23) రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో తొలి సమావేశాలు జరగనున్నాయి.

ఏపీలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ప్రమాణ స్వీకారానికి వేళాయే..
AP Municipal Corporations

విజయవాడ, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని 100 పట్టణ స్థానిక సంస్థల నూతన పాలకవర్గాల తొలి సమావేశాలు రేపు (నవంబర్ 23) రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో తొలి సమావేశాలు జరగనున్నాయి. తొలి సమావేశాల్లో కొత్తగా ఎన్నికైన మేయర్లు, ఛైర్‌పర్సన్లు, వార్డు సభ్యులతో ఎన్నికల సంఘం అధికారులు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం అదే రోజు డిప్యూటీ మేయర్లు, వైస్ ఛైర్‌పర్సన్ల ఎన్నికల ప్రక్రియ జరగనుంది.


విశాఖపట్నం, విజయవాడ, విజయనగరం, ఏలూరు, మచిలీపట్నం, గుంటూరు, ఒంగోలు కార్పొరేషన్లలో తొలి సమావేశాలు జరగనున్నాయి. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం కార్పొరేషన్లలోనూ రేపే (సోమవారం) డిప్యూటీ మేయర్ ఎన్నికలను నిర్వహించనున్నారు. రేపటి తొలి సమావేశం నుంచే రాష్ట్రంలోని 100 పట్టణ స్థానిక సంస్థల పాలకవర్గాల ఐదేళ్ల పదవీకాలం ప్రారంభం కానుంది. ఈ సమావేశాల నిర్వహణ, ఈ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మున్సిపల్ కమిషనర్లకు ఏపీ ఎన్నికల సంఘం అధికారులు ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

స్థానిక ఎన్నికల్లో 90 శాతం పైగా స్ట్రైక్ రేట్ సాధించాం: సీఎం చంద్రబాబు

ప్రకాశం జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి

అమరావతిని బెస్ట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 22 , 2026 | 04:47 PM