వైసీపీకి మిగిలేది కక్షలు, అప్పులే.. సోమిరెడ్డి సెటైర్లు
ABN , Publish Date - Nov 22 , 2026 | 03:04 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాటలు వింటే చివరకు మిగిలేది కక్షలు, అప్పులేనని విమర్శించారు.
నెల్లూరు జిల్లా, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandra Mohan Reddy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి మాటలు వింటే చివరకు మిగిలేది కక్షలు, అప్పులేనని విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఈవీఎంలతో గెలిచామని కూటమి గురించి వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారని, ఇప్పుడు బ్యాలెట్లతో జరిగిన ఎన్నికల ఫలితాలపై ఏమంటారు..? అని ప్రశ్నించారు. ఈరోజు (ఆదివారం) నెల్లూరు జిల్లా వేదికగా మీడియాతో సోమిరెడ్డి మాట్లాడారు.
ప్రజాస్వామ్యం గెలిచింది..
పారదర్శకంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని.. కడప, పులివెందుల ప్రాంతంలోనూ ప్రజాస్వామ్యం గెలిచిందని సోమిరెడ్డి తెలిపారు. పులివెందుల నుంచి శ్రీకాకుళం వరకు వైసీపీ తుడిచిపెట్టుకుపోయి కూటమి క్లీన్ స్వీప్ చేసిందని ఉద్ఘాటించారు. పంచాయతీల్లో పోటీ వద్దని.. ఏకగ్రీవాలకే మొగ్గు చూపాలని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ఏకాభిప్రాయంతో సర్పంచ్‌లను ఎన్నుకోవాలని కోరారు. ఏకగ్రీవ పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.15 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
స్థానిక ఎన్నికల్లో 90 శాతం పైగా స్ట్రైక్ రేట్ సాధించాం: సీఎం చంద్రబాబు
ప్రకాశం జిల్లా ప్రమాదంపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ దిగ్భ్రాంతి
అమరావతిని బెస్ట్ క్యాపిటల్‌గా తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News