అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
ABN , Publish Date - Nov 24 , 2026 | 07:56 PM
అమరావతి ఎకనామిక్ రీజియన్ (AER) అభివృద్ధి ప్రణాళికపై కీలక ముందడుగు పడింది. మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి, ప్రత్యేక రవాణా మార్గాలపై ప్రధాన చర్చించారు.
అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): అమరావతి ఎకనామిక్ రీజియన్ (AER) అభివృద్ధి ప్రణాళికపై కీలక ముందడుగు పడింది. మచిలీపట్నం, రామాయపట్నం గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల అభివృద్ధి, ప్రత్యేక రవాణా మార్గాలపై ప్రధాన చర్చించారు. ఈరోజు (మంగళవారం) లాజిస్టిక్స్, రవాణా, పోర్టులు, విమానాశ్రయాల రంగాలపై AER తొలి రౌండ్ టేబుల్ సమావేశం రాయపూడిలోని ఏపీ సీఆర్డీఏ (APCRDA) ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్, ఏపీ సీఆర్డీఏ అదనపు కమిషనర్ రాహుల్ కుమార్ రెడ్డి, APEDB, APIIC, మారిటైమ్ బోర్డు, CII సహా పలు ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు, కంటైనర్ రైలు టెర్మినల్స్ ఏర్పాటుపై అధికారులు సమీక్షించారు. విజయవాడ విమానాశ్రయంలో అంతర్జాతీయ కార్గో టెర్మినల్ ఏర్పాటుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.
విజయవాడ - గుంటూరు - అమరావతి పరిధిలో ఆధునిక గిడ్డంగుల నిర్మాణ అవసరాలపై అధికారులు చర్చించారు. భూమి లభ్యత, కస్టమ్స్ ఖర్చుల రికవరీ, సరుకు రవాణా అంచనాలపై పెట్టుబడిదారులు స్పష్టత కోరారు. మచిలీపట్నం పోర్టును తూర్పు తీరానికి కీలక గేట్‌వేగా తీర్చిదిద్దాలని ఏపీ మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ కుమార్ సూచించారు. ఆక్వా, ఉద్యానవన ఎగుమతుల కోసం ఎయిర్ కార్గో, కోల్డ్‌చైన్ సదుపాయాలను బలోపేతం చేయాలని ఆదేశించారు. అంతర్గత జలరవాణా పునరుద్ధరణ, సూక్ష్మస్థాయి లాజిస్టిక్స్ ప్రణాళికల రూపకల్పనకు పిలుపునిచ్చారు. AERలో మొత్తం 8 రంగాల సమావేశాల్లో మొదటిది పూర్తి చేయగా, త్వరలో మిగతా రంగాలపై ఆయా సమావేశాలు జరగనున్నాయని సురేశ్ కుమార్ తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు
ఏపీని మారిటైం, ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్
నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News