Share News

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:15 PM

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ డిసెంబరు 21వ తేదీలోగా ఎన్నికల వ్యయ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.

అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
AP SEC Anil Chandra Punetha

విజయవాడ, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరూ డిసెంబరు 21వ తేదీలోగా ఎన్నికల వ్యయ వివరాలను తప్పనిసరిగా సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా (AP SEC Anil Chandra Punetha) ఆదేశించారు. ఎన్నికల్లో గెలిచినవారు, ఓడిపోయినవారు అనే తేడా లేకుండా పోటీ చేసిన ప్రతి అభ్యర్థీ తమ ఖర్చుల తుది వివరాలను వెంటనే అందజేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాలను సంబంధిత ఎంపీడీవో (MPDO) కార్యాలయం ద్వారా జిల్లా ఎన్నికల అధికారికి సమర్పించాలని సూచించారు.


నవంబరు 7వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో, నిబంధనల ప్రకారం 45 రోజుల్లోగా (డిసెంబర్ 21 లోపు) ఈ లెక్కలు అప్పగించాలని ఎస్ఈసీ ఆజ్ఞాపించారు. ఈ గడువులోగా వ్యయ వివరాలను సమర్పించని అభ్యర్థులపై పంచాయతీరాజ్ చట్టం సెక్షన్ 19-B ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. లెక్కలు చెప్పని అభ్యర్థులు మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హతకు గురవుతారని, గెలిచిన వారైతే పదవి కూడా కోల్పోతారని స్పష్టం చేశారు. అభ్యర్థులందరూ ఈ గడువులోగా వివరాలను సమర్పించేలా ఎంపీడీవోలు చొరవ తీసుకోవాలని, కలెక్టర్లు విస్తృత ప్రచారం కల్పించాలని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.


ఎన్నికల అధికారులకు ఎస్‌ఈసీ ఆదేశాలు..

ఎన్నికల అధికారులకు ఏపీ ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా కీలక ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో 23 పట్టణ స్ధానిక సంస్దల ఎన్నికల కౌంటింగ్ కోసం అదనపు టేబుళ్లను ఏర్పాటు చేయాలని ఆజ్ఞాపించారు. ఈనెల 30వ తేదీన ఉదయం 8 గంటలకు మొదలయ్యే కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 8 గంటల్లోగా ముగించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అవసరమైన మేర కౌంటింగ్ టేబుళ్లు, సిబ్బందిని సిద్దంగా ఉంచాలని ఆజ్ఞాపించారు. మేయరు, ఛైర్మన్ ఓట్ల లెక్కింపు కోసం, వార్డు సభ్యుల లెక్కింపునకు అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఎస్‌ఈసీ అనిల్ చంద్ర పునేఠా ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు

ఏపీని మారిటైం, ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 06:38 PM