Share News

డ్రగ్స్ మహమ్మారితో దేశ ఉనికికే ముప్పు: కిషన్‌రెడ్డి

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:18 PM

నషా ముక్త భరత్ కార్యక్రమానికి బుధవారం హైదరాబాద్ వేదిక కానుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. డ్రగ్స్ మహమ్మారితో దేశ ఉనికికే ముప్పు ఉందని హెచ్చరించారు.

డ్రగ్స్ మహమ్మారితో దేశ ఉనికికే ముప్పు: కిషన్‌రెడ్డి
Kishan Reddy

హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): నషా ముక్త భరత్ కార్యక్రమానికి రేపు (బుధవారం) హైదరాబాద్ వేదిక కానుందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) వ్యాఖ్యానించారు. డ్రగ్స్ మహమ్మారితో దేశ ఉనికికే ముప్పు ఉందని హెచ్చరించారు. దేశంలో డ్రగ్స్ ఫ్రీ ఉండటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. రాజకీయాల గురించి తర్వాత మాట్లాడుదామని తెలిపారు. ఈరోజు (మంగళవారం) ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీడియాతో కిషన్‌రెడ్డి ప్రత్యేకంగా మాట్లాడారు.


డ్రగ్స్ తీసుకున్న వారిపై కఠినంగా ఉండాలి..

దేశ ప్రజల ఉనికితో కూడిన సమస్య ఇదని కిషన్‌రెడ్డి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమం కాదని.. ప్రతి పౌరుని బాధ్యత అని తెలిపారు. డ్రగ్స్ మహమ్మారిన పడి పంజాబ్ రాష్ట్రం ఉనికి కోల్పోయే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ హయాంలో డ్రగ్స్ తీసుకున్న వారిపై కఠినంగా ఉంటామని చెప్పారని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డ్రగ్స్‌పై పోరాడాలని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి డ్రగ్స్ రహిత హైదరాబాద్, డ్రగ్స్ రహిత తెలంగాణ , డ్రగ్స్ రహిత దేశాన్ని నిర్మించుకుందామని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 07:07 PM