సర్పంచ్ ఎన్నికల పోటీలోని రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్..
ABN , Publish Date - Nov 25 , 2026 | 09:24 PM
సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెబల్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. బుధవారం ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న రెబల్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు (బుధవారం) ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో కుప్పం నియోజకవర్గ టీడీపీ నేతలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు తమ్ముళ్లతో పలు కీలక అంశాలపై చంద్రబాబు చర్చించారు.
ఈ క్రమంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని రెబల్ అభ్యర్థుల వ్యవహారంపై సీరియస్ అయ్యారు. కూటమి బలపరిచిన అభ్యర్థుల విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆజ్ఞాపించారు. రెబల్ అభ్యర్థులు ఇవాళ రాత్రిలోగా కూటమి అభ్యర్థులకు సహకరించాలని ఆదేశించారు. సహకరించని పక్షంలో రేపటి నుంచి టీడీపీతో సంబంధం ఉండదని హెచ్చరించారు. రెబల్ అభ్యర్థులకు మద్దతు తెలిపే నాయకులు, కార్యకర్తలపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని మందలించారు. టీడీపీ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యవహారించే వారిపై చర్యలు తప్పవని సీఎం చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మత్స్యకారుల ఆచూకీ కోసం ముమ్మరంగా గాలించాలి.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధిపై కీలక ముందడుగు.. పోర్టులు, లాజిస్టిక్స్‌పై ప్రత్యేక దృష్టి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News