టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాలు.. వెలుగులోకి సంచలన విషయాలు
ABN , Publish Date - Sep 02 , 2026 | 09:30 PM
టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాల విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ ఇచ్చిన నివేదిక తర్వాతే... తిరుమల శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈఓ మేండు లోకనాథంపై అక్రమాస్తుల కేసు నమోదు చేసినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు.
తిరుపతి, సెప్టెంబర్ 2 (ఆంధ్రజ్యోతి): టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో ఏసీబీ సోదాల విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ ఇచ్చిన నివేదిక తర్వాతే... తిరుమల శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈఓ మేండు లోకనాథంపై అక్రమాస్తుల (Disproportionate Assets) కేసు నమోదు చేసినట్లుగా ఏసీబీ అధికారులు తెలిపారు. టీటీడీ లడ్డూ కల్తీ కేసును సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన సమయంలో టీటీడీకి చెందిన కొందరు ఉద్యోగుల ఆస్తుల సమాచారాన్ని ఏసీబీకి.. సీబీఐ అధికారులు అందించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పీఏ కే.చిన్న అప్పన్నపై గతంలో కేసు నమోదవగా, తాజాగా మేండు లోకనాథంపై సెక్షన్ 13(2) r/w 13(1)(b) కింద కేసు నమోదు చేశామని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
తిరుపతిలోని లోకనాథం ఇళ్లు, బంధువుల ఇళ్లు కలిపి మొత్తం 04 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. లోకనాథం, ఆయన కుమారుడి పేరుతో నాలుగు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, బావమరిది ఇంట్లో రూ.12.5 లక్షల నగదు, రెండు కిలోల బంగారం, 6.5 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. భార్య పేరుతో రూ.31.98 లక్షల విలువైన సంయుక్త ఆస్తి పత్రాలు ఉన్నాయని ఏసీబీ అధికారులు గుర్తించారు.
స్వాధీనం చేసుకున్న ఆస్తుల ప్రాథమిక అంచనా విలువ సుమారు రూ.5.00 కోట్ల వరకు ఉంటుందని అధికారుల దర్యాప్తులో తేలింది. అతను 01.02.1989న కారుణ్య నియామకం కింద టీటీడీలో జూనియర్ అసిస్టెంట్‌గా చేరి, ప్రమోషన్ల ద్వారా ప్రస్తుతం తిరుమల డిప్యూటీ ఈఓగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని ఏసీబీ అధికారులు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పిఠాపురం అభివృద్ధిపై పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్
సత్ఫలితాలిస్తున్న అక్షర ఆంధ్ర... సంపూర్ణ అక్షరాస్యత దిశగా అడుగులు వేస్తున్నాం: మంత్రి లోకేశ్
ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News