ఏపీలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు: మంత్రి ఆనం
ABN , Publish Date - Sep 01 , 2026 | 07:39 PM
ఎల్‌నినో ప్రభావంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని తెలిపారు.
నెల్లూరు, సెప్టెంబర్ 1 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (AP Minister Anam Ramanarayana Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనే ప్రమాదం ఉందని తెలిపారు. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల్లో నీటి ప్రవాహాలు లేక జలాశయాలు ఎండిపోతున్నాయని పేర్కొన్నారు. ఈరోజు (మంగళవారం) నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
తాగడానికి కూడా నీళ్లు దొరకడం కష్టమే..
రాబోయే 6 నెలల్లో పంటలకే కాదని, తాగడానికి కూడా నీళ్లు దొరకడం కష్టమేనని మంత్రి ఆనం వ్యాఖ్యానించారు. భూగర్భ జలాలు ఇప్పటికే 3 మీటర్లు పడిపోయాయని.. మరింత తగ్గే అవకాశం ఉందని వెల్లడించారు. చేతికి వచ్చిన ధాన్యాన్ని డబ్బుల కోసం వెంటనే మార్కెట్లో అమ్మేసుకోవద్దని అన్నదాతలకు సూచించారు. వచ్చే జూన్, జులై వరకు సరిపడేలా ప్రతి ఒక్కరూ ధాన్యాన్ని భద్రపరుచుకోవాలని మార్గనిర్దేశం చేశారు. నీరు, ఆహార ధాన్యాల పొదుపుపై ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో వెలిగొండ ప్రాజెక్ట్‌కు గ్రహణం పట్టింది: సీఎం చంద్రబాబు
పవన్ కల్యాణ్ ఆదేశాలు.. ఏపీలో పర్యావరణ పరిరక్షణకు స్పెషల్ డ్రైవ్
రోశయ్య స్ఫూర్తితో యువత రాజకీయాల్లోకి రావాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News