శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకోం.. జగన్ అండ్‌కోకు మంత్రి స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Oct 06 , 2026 | 02:57 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీసీ హయాంలో అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపు కొట్టారని ధ్వజమెత్తారు.
శ్రీ సత్యసాయి జిల్లా, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి సవిత (AP Minister Savitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీసీ హయాంలో అన్న క్యాంటీన్లను మూసివేసి పేదల కడుపు కొట్టారని ధ్వజమెత్తారు. ఈరోజు (మంగళవారం) శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ నియోజకవర్గం గోరంట్లలో సొంత నిధులతో అన్న క్యాంటీన్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సవిత మాట్లాడారు. అన్న క్యాంటీన్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదల కడుపు నింపారని చెప్పుకొచ్చారు.
పేదల కడుపు నింపే అవకాశం నాకు లభించింది..
సీఎం స్ఫూర్తితో తన సొంత నిధులతో పెనుకొండలో అన్న క్యాంటీన్ నెలకొల్పానని మంత్రి సవిత తెలిపారు. వెయ్యి రోజుల పాటు పేదల కడుపు నింపే అవకాశం తనకు లభించిందని అన్నారు. ఇప్పుడు గోరంట్లలో సొంత నిధులతో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించానని తెలిపారు. గొడ్డలి పార్టీ నాయకులకు విధ్వంసమే తెలుసు అని ఎద్దేవా చేశారు.
కార్యకర్తలను పొట్టన పెట్టుకునే సంస్కృతి వైసీపీది..
సొంత పార్టీ కార్యకర్తలను పొట్టన పెట్టుకునే సంస్కృతి వైసీపీదని మంత్రి సవిత విమర్శించారు. జగన్‌కు, పార్టీ నాయకులకు దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలని సవాల్ చేశారు. ఏపీలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా, అభివృద్ధిని అడ్డుకున్నా చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. ఖబడ్దార్... ఎప్పుడు, ఎలా.. మీ సంగతి తేల్చాలో సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్‌కు తెలుసునని మంత్రి సవిత వార్నింగ్ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏషియన్ గేమ్స్‌లో స్వర్ణం.. జ్యోతి సురేఖకు మంత్రి నారా లోకేశ్ అభినందనలు
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News