KTR VS Congress: నా కార్ల విషయంలో తప్పు చేస్తే కేంద్రం చర్యలు తీసుకోవచ్చు: కేటీఆర్
ABN , Publish Date - Sep 26 , 2025 | 06:18 PM
కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో మాగంటి సునీత మంచి మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్‌కు ఉందని కేటీఆర్ ఉద్ఘాటించారు.
హైదరాబాద్, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇవాళ (శుక్రవారం) తెలంగాణ భవన్‌లో మీడియాతో కేటీఆర్ మాట్లాడారు. తన అరెస్టుపై కాంగ్రెస్ (Congress) నేతలు కలలు కంటున్నారని కేటీఆర్ విమర్శించారు. తన అరెస్టు కోసం కాంగ్రెస్ నేతలు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. అరెస్టు చేసుకోండి... అరెస్టు భయం తనకు లేదని స్పష్టం చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
తన అరెస్టుతో సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)కి పైశాచిక ఆనందం తప్పా మరొకటి రాదని కేటీఆర్ మండిపడ్డారు. తాను ఏ తప్పు చేయలేదని... ఏం చేసుకుంటారో చేసుకోవాలని సవాల్ విసిరారు. తనతో రేవంత్‌రెడ్డి లై డిటెక్టర్ టెస్ట్‌కు రావాలని ఛాలెంజ్ చేశారు కేటీఆర్. ఏసీబీ కేసు తనపై ఉందని... రేవంత్‌రెడ్డిపైనా ఏసీబీ కేసుందని గుర్తుచేశారు. ఆర్ఎస్(రేవంత్, సంజయ్) బ్రదర్స్‌కు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. ఆర్ఎస్ బ్రదర్స్‌కు తాను ఏ కారులో తిరుగుతున్నానో మాత్రమే కావాలని ఎద్దేవా చేశారు మాజీ మంత్రి కేటీఆర్.
కార్ల విషయంలో తాను తప్పు చేస్తే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో మాగంటి సునీత మంచి మెజారిటీతో గెలవబోతున్నారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ప్రజల ఆశీర్వాదం కేసీఆర్‌కు ఉందని ఉద్ఘాటించారు. హైదరాబాద్‌లో మొన్నటి ఎన్నికల్లో గెలిచామని.. నిన్న గెలిచాం.. రేపూ గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పెద్దలకు హైడ్రా చుట్టం.. పేదలకు భూతమని ధ్వజమెత్తారు. వివేక్, కేవీపీ రామచంద్రరావు, తిరుపతి రెడ్డి ఇళ్లను హైడ్రా ఎందుకు కూల్చదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అలర్ట్.. విమానాల దారి మళ్లింపు.. అసలు విషయమిదే..
కేసీఆర్ చేసిన అభివృద్ధే నన్ను గెలిపిస్తుంది: మాగంటి సునీత
For More TG News And Telugu News