Flight Ticket Prices: హైదరాబాద్ నుంచి విమాన ప్రయాణం చేస్తున్నారా.. ఈ విషయాలు తెలుసుకోండి
ABN , Publish Date - May 02 , 2025 | 11:54 AM
Flight Ticket Prices: భారతదేశం, పాకిస్తాన్ దేశాల మధ్య ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఆంక్షలు విధించాయి. దీంతో విమాన టిక్కెట్ల ధరలు పెరిగాయి. దీంతో పాటు అదనపు సమయం కూడా పడుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
హైదరాబాద్: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది పర్యాటకులు చనిపోయారు. పర్యాటకులపై టెర్రరిస్టులు అమానుషంగా కాల్పులు జరిపారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాకిస్తాన్ దేశంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాకిస్తాన్ చర్యలను పలువురు ఖండిస్తున్నారు. ఉగ్రవాదుల జరిపిన దాడితో భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే దీని ప్రభావం విమాన ప్రయాణికులపై పడింది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లే విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
హైదరాబాద్ నుంచి అమెరికా, దుబాయ్, బ్రిటన్ దేశాలకు వెళ్లే ప్రయాణికులపై అదనపు భారం పడుతోంది. టిక్కెట్ ధరలు పెరగడంతో పాటు ప్రయాణ సమయాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సుమారు గంట నుంచి రెండు గంటల పాటు అదనపు సమయం పడుతోంది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఏప్రిల్ 24వ తేదీన పాకిస్తాన్ ఆకాశమార్గం వైపుగా వెళ్లే భారత విమానాలపై ఆంక్షలు విధించింది.
ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి పలు దేశాలకు వెళ్లే విమానాలను ఆయా కంపెనీలు ప్రత్నామ్నాయ మార్గం ద్వారా పంపిస్తున్నాయి. ఇదిలా ఉండగా భారతదేశం కూడా పాకిస్తాన్ నుంచి వచ్చే విమానాలను తమ ఆకాశం మార్గం ద్వారా వెళ్లకూడదని నిషేధం విధించింది. ఏప్రిల్ 30 అర్ధరాత్రి నుంచి మే 23 వరకు ఈ నిషేధం కొనసాగుతుందని భారత్ ప్రకటించింది. దీంతో పాటు హైదరాబాద్ నుంచి దుబాయ్, ఉత్తర అమెరికా, లండన్ వెళ్లే ఇండిగో, ఎయిర్ ఇండియా, ఎయిర్ ఎక్స్‌ప్రెస్ విమానాల షెడ్యూళ్లలో భారీ మార్పులు చేశాయి. మే 1 నుంచి ఈ మార్పులు చేసినట్లు ఆయా విమానయాన సంస్థలు ప్రకటించాయి.
ఈ వార్తలు కూడా చదవండి
Gold Rates Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్..ఎంతకు చేరాయంటే..
Financial Aid: పుస్తకాల ముద్రణకు తెలుగు వర్సిటీ ఆర్థిక సహాయం
డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం
Gold Smuggling: శంషాబాద్ విమానాశ్రయంలో 3.5 కిలోల బంగారం పట్టివేత
Read Latest Telangana News and National News