CM Revanth VS Kishan Reddy: రిజర్వేషన్లపై కిషన్ రెడ్డి చట్టం చదవాలి.. సీఎం రేవంత్ సూచనలు
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:20 PM
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి సీఎం రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి ముందుగా చట్టం చదవాలని సూచించారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చిచెప్పారు.
ఢిల్లీ, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి (Kishan Reddy) సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కిషన్‌రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కిషన్‌రెడ్డి ముందుగా చట్టం చదవాలని సూచించారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ లేదని స్పష్టం చేశారు. బీసీఈకి ఇప్పటికే 4శాతం రిజర్వేషన్లు ఉన్నాయని తేల్చిచెప్పారు. కొత్తగా పదిశాతం రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అని ప్రశ్నల వర్షం కురిపించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్ల కోసం తాము పోరాడుతామని ఉద్ఘాటించారు సీఎం రేవంత్‌రెడ్డి.
ఇవాళ(గురువారం) ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల బిల్లును రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నామని చెప్పుకొచ్చారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం ఇవాళ సాయంత్రం వరకు వేచి చూస్తామని తెలిపారు. రాష్ట్రపతి స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నామని అన్నారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ ఇవ్వకుంటే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఒత్తిడి చేసినట్లుగా తాము భావిస్తామని పేర్కొన్నారు. 42శాతం రిజర్వేషన్ల అమలుకు ఉన్న అన్ని మార్గాలను తాము ప్రయత్నించామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్‌రెడ్డి .
బీసీ రిజర్వేషన్లపై ఇక బీజేపీ నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. తమ కమిట్‌మెంట్‌కు బీజేపీ సర్టిఫికెట్ అవసరం లేదని తేల్చిచెప్పారు. ప్రజలను అబద్ధాలతో మభ్యపెట్టడం బీఆర్ఎస్ నైజమని విమర్శించారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు తమ దగ్గర మూడు మార్గాలు ఉన్నాయని వెల్లడించారు. కేంద్రప్రభుత్వం ఆమోదం తెలిపే వరకు తాము వేచి చూస్తామని పేర్కొన్నారు. జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు తాము వెళ్లమని క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పరంగా 42శాతం రిజర్వేషన్లు ఇచ్చిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామని స్పష్టం చేశారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ఇతర పార్టీలపైనా తాము ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ హైకోర్టు చెప్పినట్లే సెప్టెంబర్ 30వ తేదీలోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
మరోవైపు.. ఇవాళ(గురువారం) ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో సమావేశం అయ్యారు. పార్లమెంటులోని మల్లికార్జున ఖర్గే ఛాంబర్‌లో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎంపీలు కలిశారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై ఖర్గేతో రేవంత్‌రెడ్డి చర్చించారు. ఈ సమావేశానికి మంత్రులు శ్రీధర్ బాబు, వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండాసురేఖ, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, తదితరులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రాజ్‌గోపాల్ రెడ్డిపై కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ నజర్
తెలంగాణ ఉద్యమ ఆయువుపట్టు గద్దర్
Read latest Telangana News And Telugu News