Bhanu Prakash Reddy: జగన్ హయాంలోనే రథాలు తగలబెట్టడం, దేవాలయాలపై దాడులు..
ABN , Publish Date - Dec 12 , 2025 | 11:55 AM
జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు.
ఢిల్లీ, డిసెంబరు12(ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి (Bhanu Prakash Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి 2024 వరకు హిందూ వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలిందని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో రథాలు తగలబెట్టడం, హిందూ దేవాలయాలపై దాడులు చేశారని దుయ్యబట్టారు. ఆలయాన్ని అడ్డంపెట్టుకుని అపచారాలు, అవినీతికి పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇవాళ(శుక్రవారం) ఢిల్లీ వేదికగా మీడియాతో మాట్లాడారు భాను ప్రకాశ్ రెడ్డి.
ధనార్జన క్షేత్రంగా మార్చారు..
జగన్ హయాంలో ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారని ఆరోపించారు. ధర్మకర్త మండలి, అధ్యక్షులు, అధికారులు స్వామి వారి పవిత్రతను దెబ్బతీశారని విమర్శలు చేశారు. తమ ప్రభుత్వంలో తిరుమల వేంకటేశ్వరస్వామి వారి లడ్డూని భక్తులందరూ ఎంతో సంతోషంగా తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. జగన్ హయాంలో లడ్డూపైన పొరలు వచ్చేవని... సరిగా రాకపోవడం వాసన వచ్చేదని తెలిపారు. ఈ అంశాన్ని గతంలో టీటీడీ చైర్మన్‌కి చెప్పినప్పటికీ పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు భాను ప్రకాశ్ రెడ్డి.
చిన్న దొంగతనమా..?
‘అపచారం, అవినీతి, అక్రమాలకు టీటీడీని గత వైసీపీ పాలకులు వాడుకున్నారు. నిందితుడు రవికిరణ్ టీటీడీ పరకామణిలో (డాలర్లు)దొంగలిస్తే చిన్న దొంగతనమని జగన్ అంటున్నారు... అసలు ఆయనకు బుద్ధి ఉందా..?. అదే ఆయన దేవుడు దగ్గర జరిగి ఉంటే ఇలానే స్పందించేవారా..?. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విచారణకు ఆదేశిస్తే పోలీసు అధికారులను ఒత్తిడికి గురి చేశామని చెబుతున్నారు. ఏవీఎస్ఓ అధికారి సతీశ్ కుమార్ మృతిపై ఎన్నో అనుమానాలు ఉన్నాయి. టీటీడీలో దొంగతనం చేసిన రవికుమార్ నుంచి జగన్ రెడ్డి రూ.14 కోట్ల ఆస్తులను రాయించుకున్నారు. దొంగతనాన్ని, కానుకగా చేశారు. కరుణాకర్ రెడ్డి నేను ఉప్పు, నిప్పు అని చెబుతుంటారు..... ఆరోజు పరకామణిలో దొంగతనం జరిగితే ఎందుకు ప్రశ్నించలేదు. నిందితుడు రవికుమార్ ఒక నెల ముందే తన ఆస్తులను టీటీడీకి రాసిస్తామని ఎలా చెప్పారు . ధార్మిక క్షేత్రంలో దాపరికాలు చేశారు’ అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భాను ప్రకాశ్ రెడ్డి.
విజువల్స్ ఎక్కడ..?
‘పరకామణిలో రవికుమార్ డాలర్లను దొంగలించిన సమయంలో విజువల్స్ ఎక్కడికి వెళ్లాయి... ఆ విజువల్స్ ఏమయ్యాయి జగన్ రెడ్డి..?. వీడియో ఏమైందనే దానిపై నేను ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా నమోదు చేశాను. ఈ సందర్భంగా జగన్ రెడ్డిని మూడు ప్రశ్నలు అడుగుతున్నాను. పోలీసుల నుంచి రవికుమార్‌కు ఒత్తిడి వచ్చిందని చెప్పారు, ఎవరా పోలీసులు..?. గత పాలనలో ఐపీసీ సెక్షన్లు నడవలేదు. వేంకటేశ్వరస్వామి భక్తులు ఎవరూ ఆందోళన చెందొద్దు. గత ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకుంటూ తాము ముందుకు వెళ్తున్నాం. కూటమి ప్రభుత్వంలో భక్తులందరూ సంతోషంగా స్వామివారి దర్శనం చేసుకోవాలి’ అని భాను ప్రకాశ్ రెడ్డి సూచించారు .
ఈ వార్తలు కూడా చదవండి..
దువ్వాడ మాధురి శ్రీనివాస్‌కి బిగ్ షాక్.. అసలు విషయమిదే..
అల్లూరి జిల్లా బస్సు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రధాని మోదీ
Read Latest AP News And Telugu News