స్థానిక ఎన్నికల్లో వైసీపీ వాష్ అవుటే లక్ష్యంగా టీడీపీ బిగ్ ప్లాన్
ABN, Publish Date - Sep 15 , 2026 | 07:55 AM
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా టీడీపీ అధినాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ వైసీపీని పూర్తిగా తుడిచిపెట్టాలని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
ఇంటర్నెట్ డెస్క్, సెప్టెంబర్ 15 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల (మున్సిపల్, కార్పొరేషన్) ఎన్నికల్లో వైసీపీని ఓడించి రికార్డులతో పండుగ చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ హై కమాండ్ భావిస్తోంది. 2024 సాధారణ ఎన్నికల తరహాలోనే లోకల్ బాడీ ఎన్నికల్లోనూ పట్టునిలుపుకోవాలనే ప్రయత్నంలో టీడీపీ ఉంది.
వైసీపీకి ఒక్కసీటు కూడా రాకుండా ఫ్యాన్ రెక్కలు విరిగిపోయేలా చేయాలనే వ్యూహంతో తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతోంది. కూటమి ప్రభంజనం మరోసారి కనిపించేలా ఈ ఎన్నికల ప్రణాళికలను రూపొందిస్తోంది. ఎన్డీఏ భాగస్వాములైన టీడీపీ, జనసేన, బీజేపీలో టికెట్ల కోసం పోటీ ఎక్కువగా కనిపిస్తోంది. టీడీపీలోనూ ఆశావాహుల సంఖ్య అధికంగా ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో పాల్గొననున్న సీఎం చంద్రబాబు
బొమ్మదేవర ధీరజ్.. భారత క్రీడా చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించారు: పవన్ కల్యాణ్
కాణిపాకం నుంచే ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు కొత్త ఊపిరి: మంత్రి ఆనం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News
Updated at - Sep 15 , 2026 | 08:08 AM