రేవంత్ రెడ్డి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు.. హరీశ్‌రావు ధ్వజం
ABN , Publish Date - Apr 12 , 2026 | 07:52 PM
సీఎం రేవంత్ రెడ్డి పేదల ఇళ్లు కూలగొడుతున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి పేదల బతుకులు, ఇళ్లు కూల్చడానికి హైడ్రా తెచ్చారని ధ్వజమెత్తారు.
సిద్దిపేట జిల్లా, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేదల ఇళ్లు కూలగొడుతున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి పేదల బతుకులు, ఇళ్లు కూల్చడానికి హైడ్రా తెచ్చారని ధ్వజమెత్తారు. ఈరోజు(ఆదివారం) సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్‌రావు సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్‌లకు చెందిన పలువురు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. కాంగ్రెస్ పాలన ఏంటో రాష్ట్ర ప్రజలకు అర్థమైందని విమర్శించారు. రేవంత్ రెడ్డి కొత్త పథకాలు ఇవ్వలేదని, కేసీఆర్ హయాంలో ఉన్నవాటిని బంద్ చేశారని ఆగ్రహించారు.
గ్రామసభలు, వార్డు సభల్లో కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారని అన్నారు. తెలంగాణ ఆరు గ్యారంటీలు అమలు చేశామని కేరళ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గొప్పలు చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ రాకముందు 23 లక్షల పెన్షన్లు ఉండేవని.. కేసీఆర్ వచ్చాక 20 లక్షలు పెంచి మొత్తం 43 లక్షలకు పెన్షన్లు ఇచ్చారని ప్రస్తావించారు. రేవంత్ రెడ్డిది ఇంట్లో ఈగల మోత, బయట పల్లకి మోత అని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్దాలే, ఉత్త ముచ్చట్లేనని సెటైర్లు గుప్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఏ మొహం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. సిద్దిపేట అభివృద్ధిలో రాష్ట్రానికి ఆదర్శమని ఉద్ఘాటించారు. రేవంత్ రెడ్డికి సిద్దిపేట అంటే పగ, కుట్ర అని హరీశ్‌రావు ఆరోపించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుపై పీకో టెక్నాలజీ ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు
పూలే స్పూర్తికి భిన్నంగా కాంగ్రెస్ పాలన: బండి సంజయ్
Read Latest Telangana News And AP News And International News And Telugu News