హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటుపై పీకో టెక్నాలజీ ఆసక్తి: మంత్రి శ్రీధర్ బాబు
ABN , Publish Date - Apr 11 , 2026 | 03:43 PM
న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న పీకో టెక్నాలజీ ఇండియా హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో పీకో టెక్నాలజీ విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నామని పేర్కొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న పీకో టెక్నాలజీ ఇండియా (PICO Technology India) హైదరాబాద్‌లో జీసీసీ ఏర్పాటు చేయడానికి ఆసక్తి చూపిస్తోందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhara Babu) వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో పీకో టెక్నాలజీ విస్తరణకు ప్రణాళికలు రచిస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు(శనివారం) తెలంగాణ సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబుతో పీకో టెక్నాలజీ ప్రతినిధులు సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
5 నుంచి 20 సంవత్సరాల అవసరాలకు సరిపడే మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికలు చేస్తున్నామని అన్నారు. హైదరాబాద్ జీసీసీల (GCC)ల గమ్యస్థానమని పేర్కొన్నారు. గ్లోబల్ ఫైనాన్స్ కంపెనీలు హైదరాబాద్‌కు వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయని తెలిపారు. బెంగళూరు, ముంబైతో పోలిస్తే తక్కువ ట్రాఫిక్, కాలుష్యం హైదరాబాద్‌కు అడ్వాంటేజ్ అని తెలిపారు. ఆఫీస్ ఆక్యుపెన్సీ హైదరాబాద్‌లో 73శాతం, ముంబైలో కేవలం 52శాతం మాత్రమేనని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు
సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ
హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News