పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
ABN , Publish Date - Apr 11 , 2026 | 01:52 PM
పంట కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహించారు.
సిద్దిపేట, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): పంట కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహించారు. ఈరోజు(శనివారం) సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌ని హరీశ్‌రావు సందర్శించారు. పొద్దు తిరుగుడు, మొక్కజొన్న ధాన్యాన్ని నాలుగు రోజుల నుంచి కొనుగోలు చేయడం లేదని హరీశ్‌రావుకి రైతులు విన్నవించారు. అన్నదాతల సమస్యలు విని అధికారులతో ఫోన్‌లో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఫూలే జయంతీ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
రైతుల పట్ల కాంగ్రెస్ సర్కార్ చిన్నచూపు చూపుతోందని ధ్వజమెత్తారు. నారాయణఖేడ్, ఆదిలాబాద్, నిజామాబాద్ కేంద్రాల్లో మొక్కజొన్న కొనుగోలు సెంటర్‌లను ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. వెంటనే కొనుగోలు సెంటర్‌లు ప్రారంభించి మద్దతు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డ్‌లను అధికారులు సందర్శించాలని అన్నారు. చాలా చోట్ల కొనుగోలు సెంటర్‌లు ప్రారంభించకపోవడంతో తక్కువ ధరకు అమ్ముకుని రైతులు నష్టపోతున్నారని చెప్పారు. సీఎం రేవంత్‌రెడ్డి పంట మార్పిడి చేయమని చెబుతున్నారు.. కానీ రైతులు పంట మార్పిడి చేస్తే వాటిని కొనే దిక్కు లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని ఫైర్ అయ్యారు. పలు జిల్లాల్లో వడగళ్ల వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు సమయానికి రైతు బంధు ఇవ్వాలని కోరారు. బీసీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దగా చేసిందని దుయ్యబట్టారు. బీసీ డిక్లరేషన్ పేరుతో రేవంత్‌రెడ్డి బీసీలను మోసం చేశారని ఆగ్రహించారు. కేసీఆర్ హయాంలో అన్ని కుల వృత్తులను ప్రోత్సహించామని చెప్పుకొచ్చారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రౌడీషీటర్లపై సీపీ సజ్జనార్ కీలక చర్యలు
సీడబ్ల్యూసీలో పార్లమెంటు వ్యూహాలపై అగ్ర నేతల చర్చ
హైదరాబాద్‌లో ప్రేమ పేరుతో వల.. హిందూ అమ్మాయిలే టార్గెట్..
Read Latest Telangana News And AP News And International News And Telugu News