Share News

రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కృషి: సీఎం రేవంత్‌రెడ్డి

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:05 PM

రైతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి భరోసా కల్పించారు. అన్నదాత సంతోషం కోసం ఓ అన్నగా తాను బాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు.

రైతుల శ్రేయస్సు కోసం మా ప్రభుత్వం కృషి: సీఎం రేవంత్‌రెడ్డి
CM Revanth Reddy

సిద్దిపేట, మార్చి22 (ఆంధ్రజ్యోతి): రైతన్నలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి (CM Revanth Reddy) భరోసా కల్పించారు. అన్నదాత సంతోషం కోసం ఓ అన్నగా తాను బాధ్యత తీసుకున్నానని పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం ట్వీట్ పెట్టారు.


రైతును ధైర్యంగా సాగులో నిలబెడతాం..

రైతును ధైర్యంగా సాగులో నిలబెట్టేందుకు తాను భరోసా ఇస్తున్నానని సీఎం రేవంత్‌‌రెడ్డి వ్యాఖ్యానించారు. 70 లక్షల మంది రైతన్నల కోసం రూ.9000 కోట్ల రైతు భరోసా నిధుల విడుదలకు నేడు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా నర్మెట్ట గ్రామ వేదికగా మరోసారి ‘మా పాలనలో - రైతే రాజు’ అని రుజువు చేస్తూ ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఆర్థిక సాయం చేసి తాము చేతులు దులుపుకోవడం లేదని.. కేవలం 17 నెలల వ్యవధిలో పామ్ ఆయిల్ పరిశ్రమ మొదలు పెట్టి, పూర్తి చేసి నేడు రైతు లోకానికి అంకితం చేస్తున్నామని వ్యాఖ్యానించారు. దానికి కొనసాగింపుగా రిఫైనరీ యూనిట్‌కు శంకుస్థాపన చేస్తున్నామని సీఎం రేవంత్‌‌రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఆరు గ్యారంటీలు చట్టమైతే అన్నివర్గాలకు లాభం: కేటీఆర్

మాజీ డీజీపీ మనుమరాలికి సైబర్ నేరగాళ్ల టోకరా.. రూ.1.20 కోట్ల మోసం

మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి షాక్..

Read Latest Telangana News And AP News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 01:45 PM