15 నిమిషాల ముందే తిరుపతి-కరీంనగర్ సూపర్‌ఫాస్ట్ రైలు
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:40 PM
ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి- కరీంనగర్ బైవీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12761) బయలుదేరే సమయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సవరించారు.
అక్టోబరు 10 నుంచి అమలు
పెద్దపల్లి: ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి- కరీంనగర్ బైవీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (రైలు నం. 12761) బయలుదేరే సమయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు సవరించారు. ప్రస్తుతం ప్రతీ బుధ, శనివారాల్లో తిరుపతి రైల్వేస్టేషన్ నుంచి రాత్రి 8:05 గంటలకు బయలుదేరుతున్న ఈ రైలు, అక్టోబరు 10 నుంచి రాత్రి 7:50 గంటలకు బయలుదేర నుంది. అంటే ప్రస్తుతం ఉన్న సమయంతో పోలిస్తే 15 నిమి షాల ముందుగా ప్రారంభమవుతుంది.
గూడూరు, విజయవాడ, వరంగల్, పెద్దపల్లి మార్గం మీదుగా కరీంనగర్‌కు చేరే ఈ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బయలుదేరే సమయ మార్పునకు సంబంధించి దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మార్పును ప్రయాణికులు గమనించి, తమ ప్రయాణ ప్రణాళికలను అందుకు అనుగుణంగా మార్చుకోవాలని రైల్వే అధికారులు సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News