పేకాట స్థావరాలుగా ఫాంహౌస్‌లు
ABN , Publish Date - Aug 08 , 2026 | 11:40 AM
పల్లెల్లో వ్యవసాయ క్షేత్రాల్లో నిర్మించుకున్న కొన్ని ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అ డ్డాలుగా మారుతున్నాయి.
విందులు, వినోదాలకు కేరాఫ్
అసాంఘిక కార్యకలాపాలు
హైదరాబాద్‌లో నిఘాతో కొత్త ప్లాన్
బచ్చన్నపేట(జనగామ): పల్లెల్లో వ్యవసాయ క్షేత్రాల్లో నిర్మించుకున్న కొన్ని ఫాంహౌస్‌లు అసాంఘిక కార్యకలాపాలకు అ డ్డాలుగా మారుతున్నాయి. బచ్చన్నపేట మండల పరిధిలోని పలు గ్రామాల్లో హైదరాబాద్‌తోపాటు వివిధ పట్టణాల్లో, విదేశాల్లో నివాసముంటూ వ్యాపారాలు, ఉద్యోగాలు, రియల్ ఎస్టేట్ బిజినె్‌సమెన్‌లు పెద్దఎత్తున భూములు కొనుగోలు చేసి ఫాంహౌ్‌సలు నిర్మించుకున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి సెలవు రోజుల్లో వ్యవసాయ క్షేత్రాల్లో గడిపి వెళ్లేందుకు వినియోగిస్తుంటారు.
విదేశాల్లో ఉన్నవారు ఇక్కడ కొంతమందికి వ్యవసాయ భూములను కౌలుకుఇవ్వడంతో పాటు, ఫాంహౌస్‌లు నిర్మించుకున్న కొంతమంది లాభాపేక్ష కోసం పాకులాడుతుండటంతో అసాంఘిక కార్యాకలాపాలకు అడ్డాలుగా మార్చారనే ఆరోపణలు వస్తున్నాయి. హైదరాబాద్‌లో పేకాట క్లబ్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో, పేకాటరాయుళ్ల దృష్టి పల్లెల్లోని ఫాంహౌస్లపై పడింది. దీంతో రోజుకు వేలల్లో డబ్బులు ముట్టచెబుతూ అడ్డాలుగా మార్చుకుని పేకాటను కొనసాగిస్తున్నారు. ఒకేచోట కాకుండా పలు ఫాంహౌస్‌లను తమ గుప్పిట్లో పెట్టుకుని గ్రామాలు మారుస్తూ ఎవరికి అనుమాన రాకుండా తమ జూదాన్ని కొనసాగిస్తున్నారు.
మధ్య తరగతి నుంచి కోటీశ్వరుల వరకు..
పేకాటరాయుళ్లలో మధ్య తరగతికి చెందిన వారితో పాటు కోటీశ్వరుల వరకు పాల్గొంటూ వేల రూపాయలు బెట్టింగ్ పెడుతూ పేకాటాడుతున్నట్టు తెలుస్తోంది. ఆటల్లో డబ్బులు పోగొట్టుకున్న కొంతమంది పక్కదారి పట్టి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెబుతున్నారు. బడా బాబులు పేకాట కోసం వస్తుంటే స్థానికుల్లో కొందరు వారికి భారీగానే రాచమర్యాదలు చేస్తున్నట్టు తెలుస్తోంది. కొంత డబ్బులు విడిది ఏర్పాటు చేసిన వారికి ఇస్తే, వారు విందు వినోదాలు కల్పిస్తుండటంతో పాటు, అటు వైపు ఎవరైన వస్తున్నారనే సమాచారం అందిస్తుండటంతో పేకాట యధేచ్చగా కొనసాగుతోందంటున్నారు. ప్రశాంత వాతావరణం, బయటి వ్యక్తుల రాకపోకలు పెద్దగా గుర్తించలేని స్థితిలో ఉండటంతో ఫాంహౌస్‌లు పేకాట కోసం వాడుకుంటున్నట్టు తెలుస్తోంది.
మచ్చుకు కొన్ని ఘటనలు
మన్‌షాన్‌పల్లి సమీపంలో పేకాటాడి, మద్యం సేవించి అర్ధరాత్రి హైదరాబాద్‌కు వెళ్తున్న వారి కారు బోల్తాపడటంతో ఒకరు మృతి చెందగా, పలువురికి గాయాలయ్యాయి.
బచ్చన్నపేట, మద్దూరు మండలాల శివారులో కట్కూరు నుంచి మర్మాముల రోడ్డులోని ఓ ఫాంహౌస్‌లో పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. ఇందులో వివిధ జిల్లాలకు చెందిన వారు ఉన్నారు.
పోచన్నపేటలో టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డ సంఘటనలున్నాయి.
పడమటికేశ్వాపూర్ శివారు పెద్ద ఎత్తున హైదరాబాద్‌తో పాటు, వివిధ ప్రాంతాలకు చెందిన పేకాటరాయుళ్లు పోలీసులకు పట్టుబడ్డారు. పెద్ద మొత్తంలో నగదు లభించింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News