చిత్తూరులో దారుణ హత్య.. వాచ్‌మెన్ గొంతు కోసి హతమార్చిన దుండగులు
ABN , Publish Date - Aug 08 , 2026 | 10:38 AM
చిత్తూరు రూరల్ మండలం మంగాపురం వద్ద దారుణ హత్య కలకలం రేపింది. ఎన్‌ఆర్‌ఐ పట్టాభి నాయుడు ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఆనందరావు (50)ను గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు..
చిత్తూరు, ఆగస్టు 8: చిత్తూరు రూరల్ మండలం మంగాపురం వద్ద దారుణ హత్య కలకలం రేపింది. ఎన్‌ఆర్‌ఐ పట్టాభి నాయుడు ఇంటి వద్ద వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న ఆనందరావు (50)ను గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి హత్య చేశారు. ఇంటి అద్దాలను నాటుబాంబుతో పగలగొట్టి లోపలికి చొరబడిన దుండగులు.. వాచ్‌మెన్‌పై దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. చిత్తూరు డీఎస్పీ వెంకటనారాయణ ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. అసలు దుండగులు ఇంట్లోకి ఎందుకు ప్రవేశించారు? వాచ్‌మెన్ ఆనందరావును ఎందుకు హత్య చేశారు? దొంగతనం కోసమే వచ్చారా? లేక మరేదైనా కారణం ఉందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలను నిగ్గు తేల్చేందుకు ఆధారాలను సేకరిస్తున్నారు. నిందితులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసుల దర్యాప్తు ముమ్మరం చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి..
డూప్లెక్స్ ఇంట్లో బయటపడ్డ మహిళ అస్థిపంజరం..