ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి మృతి..
ABN , Publish Date - Aug 08 , 2026 | 08:56 AM
ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం లోయలో పడ్డ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
ఇంటర్‌నెట్ డెస్క్: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనం లోయలో పడ్డ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. శుక్రవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దేవ్‌ప్రయాగ్ నుంచి పౌరీ వెళుతున్న బొలెరో వాహనం శుక్రవారం సాయంత్రం సబ్దర్‌ఖల్ వద్ద ప్రమాదానికి గురైంది. రోడ్డు పక్క ఉన్న లోయలో పడిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే దేవ్‌ప్రయాగ్ పోలీసులు, ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బొలెరోలో ఒకే కుటుంబానికి చెందిన 7 మంది ఉన్నారు. వాహనం లోయలో పడగానే తీవ్రగాయాలపాలై ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడ్డ మరో ఇద్దరిని సహాయక సిబ్బంది దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓ బాలుడు మృతి చెందాడు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తున్నారు.
చనిపోయిన వారి వివరాలు..
అఫ్జల్, వయసు 49.
గుర్ఫాన్, వయసు 34 (అఫ్జల్ సోదరుడు).
సబ్బు, వయసు 40 ( అఫ్జల్ భార్య).
అనామియా, వయసు 3.
అమన్, వయసు 14.
అర్మాన్, వయసు 20.
ఇవి కూడా చదవండి
హార్దిక్‌ను ట్రేడ్ చేస్తే.. ఆ ఇద్దరినీ జట్టులోకి తీసుకోండి.. ఎంఐకి అశ్విన్ సూచన
గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి దుర్మరణం