Share News

ఇక స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

ABN , Publish Date - Jul 19 , 2026 | 10:59 PM

ప్రభుత్వం అందించనున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులతో ఇక అవకతవకలకు చెక్‌ పడనుంది. దీంతో లబ్ధిదా రులకు నేరుగా ప్రభుత్వం అందించనున్న రేషన్‌ సరుకులు అందనున్నాయి. ఈ కార్డులపై క్యూఆర్‌ కోడ్‌ ఉండడంతో వేలిముద్రల బెడద తప్పనుంది. కార్డును స్కాన్‌ చేయడంతో కుటుంబ సభ్యుల వివ రాలు స్ర్కీన్‌పై కనబడతాయి.

ఇక స్మార్ట్‌ రేషన్‌ కార్డులు
లోగో

  • డిజిటల్‌ వివరాలతో పెరగనున్న పారదర్శకత

  • లబ్ధిదారులకు తప్పనున్న బయోమెట్రిక్‌ ఇబ్బందులు

  • త్వరలో ప్రభుత్వ ఆదేశాలతో పంపిణీకి ఏర్పాట్లు

చింతలమానేపల్లి, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అందించనున్న స్మార్ట్‌ రేషన్‌ కార్డులతో ఇక అవకతవకలకు చెక్‌ పడనుంది. దీంతో లబ్ధిదా రులకు నేరుగా ప్రభుత్వం అందించనున్న రేషన్‌ సరుకులు అందనున్నాయి. ఈ కార్డులపై క్యూఆర్‌ కోడ్‌ ఉండడంతో వేలిముద్రల బెడద తప్పనుంది. కార్డును స్కాన్‌ చేయడంతో కుటుంబ సభ్యుల వివ రాలు స్ర్కీన్‌పై కనబడతాయి. డిజిటల్‌ వివరాలతో కార్డులు ఉండడంతో పారదర్శకత పెరగనుందని సర్కార్‌ భావిస్తోంది. ఇప్పటికే జిల్లా పౌరశాఖకు చేరినట్లు సమాచారం. జిల్లాలో అన్ని రకాలుగా 1,6 5,456 కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 5,45,182 లబ్ధిదారులు ఉన్నారు. ఇందులో అంత్యోదయ అన్నయోజన కార్డులు 13,388 ఉండగా 43,671 మంది లబ్ధిదారులు ఉన్నారు. అన్నపూర్ణ పథకం కార్డులు 20 ఉండగా, 20 మంది లబ్ధిదారులు ఉన్నారు. 280 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి.

- వేగవంతంగా అందించేందుకు..

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో ఆధు నిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకువచ్చి మరింత వేగవంతమైన సేవలను అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇకపై ఈ- స్మార్ట్‌ కార్డులతో రేషన్‌ సరకుల పంపిణీకి సిద్దమవుతోంది. ఇది వరకే ఉన్న పాత రేషన్‌ కార్డుల స్థానంలో ఈ- స్మార్ట్‌ కార్డులు అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పౌరసరఫరాల శాఖ లబ్దిదారులకు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు జరుగున్నాయి. కొత్త కార్డులతో ప్రజా పంపిణీలో పారదర్శకత, పూర్తి భద్రత, వేగవంతమైన సేవలు మరింత మెరుగుపడే అవకాశం ఉన్నదని చెబు తున్నారు. ఇక ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా రేషన్‌ పంపిణీకి పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఈ పాస్‌ యంత్రాలతో..

ప్రస్తుతం రేషన్‌ షాపుల్లో లబ్ధిదారుడి వివరాల ను ఈ పాస్‌ యంత్రాలతో ధ్రువీ కరించిన అనం తరం రేషన్‌ బియ్యాన్ని లబ్ధిదారులకు అందజేస్తు న్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలు రేషన్‌ పంపిణీలో రేషన్‌ కార్డులు కీలకంగా మారు తున్నాయి. అయితే ఈ-పాస్‌ స్మార్ట్‌ కార్డులను రేషన్‌ దుకాణాల్లో ఈ- పాస్‌ యంత్రాల ద్వారా స్కాన్‌ చేస్తే లబ్ధిదారుడి వివరాలను వెంటనే తెలుసుకునే అవకాశం ఉన్నది. దీంతో రేషన్‌ పంపిణీ వ్యవస్థ మరింత వేగవంతం కావడంతో పాటు వివరాల నమోదులో పొరపాట్లకు అవకాశం ఉండదు. స్మార్ట్‌కార్డు స్కాన్‌తో లబ్ధిదారుడి కుటుం బ వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. దీంతో రేషన్‌ డీలర్‌కు కొంత పని భారం తగ్గే అవకాశం ఉందంటున్నారు.

క్యూఆర్‌ కోడ్‌..

పౌరసరఫరాలశాఖకు అందించే కొత్త స్మార్ట్‌ కార్డులపై క్యూఆర్‌ కోడ్‌ ఉండడంతో నకిలీ కార్డుల జారీకి అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. ఈ- స్మార్ట్‌ కార్డులను పీవీసీ మెటీరి యల్‌తో తయారు చేస్తారు. ఇది సాధారణ కాగితపు లేదా లామినేషన్‌ కార్డుల కంటే ఎక్కువ కాలం మన్నికగా ఉంటా యి. కార్డులోని వివరాలను అధికారులు సులభంగా దృవీకరించే అవకాశం ఉన్నది. భవిష్యత్తులో ప్రభు త్వ సంక్షేమ పథకాలతో అనుసంధానం చేయడానికి ఈ- స్మార్ట్‌ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి. ప్రస్తుతం రేషన్‌ దుకాణాల్లో వివరాలు తప్పుగా నమోద కావడంతో కొంత మంది లబ్దిదారులకు రేషన్‌ సరకుల పంపిణీలో అవకవకలు జరుగుతు న్నట్లు పిర్యాదులు వస్తున్నాయి. స్మార్ట్‌ కార్డులతో ఇలాంటి పరిస్థితి ఉండదని అధికారులు చెబుతు న్నారు. ఒకే కుటుంబానికి ఒకే కార్డు ఉండడంతో పాటు తప్పుడు వివరాలతో ప్రయోజనం పొందే అవకాశం ఉండదు. క్యూఆర్‌ కోడ్‌ ఆధారంగా ధ్రువీకరణ సులువు కావండంతో పాటు రేషన్‌ పంపిణీలో పారదర్శకత ఉంటుందని అధికా రులు చెబుతున్నారు. సాంకేతిక పరి జ్ఞానంతో నాణ్యమైన సేవలు అందించే అవకాశం ఉంటుందని అధికారు లు చెబుతున్నారు.

Updated Date - Jul 20 , 2026 | 07:55 AM