ఏజెన్సీలో నీటి కష్టాలకు చెక్
ABN , Publish Date - Aug 08 , 2026 | 12:07 PM
ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాలు, తండాల్లో తాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది.
మిషన్ భగీరథ కింద రూ. 20.96 కోట్లు మంజూరు
ములుగు: ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గిరిజన గ్రామాలు, తండాల్లో తాగునీటి కొరతకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ములుగు జిల్లాలోని 10 మండలాలతో పాటు, ములుగు నియోజకవర్గం పరిధిలోకి వచ్చే మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ, గంగారం మండలాల్లోని ఆవాసాలకు దాహార్తి తీర్చేందుకు నిధులు విడుదలయ్యాయి. మొత్తం 12 మండలాల్లోని 108 ఆవాసాలకు ప్రత్యామ్నాయ అదనపు తాగునీటి వసతులు కల్పించేందుకు రూ. 20.96 కోట్లు విడుదల చేస్తూ పంచాయతీ రాజ్ శాఖ జీవో విడుదల చేసింది.
ఇందులో గోవిందరావుపేట మండలానికి అత్యధికంగా రూ. 3.97 కోట్లు కేటాయించారు. ములుగు మండలానికి రూ. 2.73 కోట్లు, వెంకటాపూర్ మండలానికి రూ. 2.65 కోట్లు, మంగపేట మండలానికి రూ. 2.26 కోట్లు, ఏటూరునాగారం మండలానికి రూ. 1.23 కోట్లు, తాడ్వాయి మండలానికి రూ. 1.61 కోట్లు, మల్లంపల్లి మండలానికి రూ.1.23 కోట్లు, కన్నాయిగూడెం మండలానికి రూ. 1.11 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది.
వాజేడు మండలానికి రూ. 1.07 కోట్లు (భద్రాద్రి కొత్తగూడెం నియోజక వర్గం), వెంకటాపురం మండలానికి రూ. 0.63 కోట్లు (భద్రాద్రి కొత్తగూడెం నియోజక వర్గం), అలాగే ములుగు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కొత్తగూడ మండలానికి రూ. 1.84 కోట్లు, గంగారం మండలానికి రూ. 0.66 కోట్లు మంజూరు చేశారు. కాగా కొత్తగూడ, గంగారం మండలాలు మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. అయితే ఈ నిధులు మిషన్ భగీరథ పథకం కింద విడుదల చేయగా, వాటిని గిరిజన ఆవాసాల్లోని తాగునీటి మౌలిక వసతులు మెరు గుపరచడానికి, నీటి వసతులు కల్పించడానికి ఉపయోగిం చనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News