తొలిసారి ఆర్టీసీ బస్సు గ్రామానికి వస్తే.. ఆ గ్రామస్థులు ఏం చేశారంటే..?
ABN , Publish Date - Aug 08 , 2026 | 10:54 AM
కొన్ని దశాబ్దాలుగా రానీ ఆర్టీసీ బస్సు తొలిసారి గ్రామానికి వస్తే ఎలా ఉంటుంది. మహదానందంగా ఉంటుంది. గ్రామస్థులంతా పండగ చేసుకుంటారు.
ఇంటర్నెట్ డెస్క్: కొన్ని దశాబ్దాలుగా రానీ ఆర్టీసీ బస్సు తొలిసారి గ్రామానికి వస్తే ఎలా ఉంటుంది. మహదానందంగా ఉంటుంది. గ్రామస్థులంతా పండగ చేసుకుంటారు. రాజస్థాన్‌లో కేక్రి జిల్లాలోని భవానీ గ్రామ వాసులు అదే చేసుకున్నారు. ఆ వీడియో వైరల్ అవుతోంది. ఆ గ్రామంలో ఇరుకైన రోడ్లకు ఇరు వైపులా వృద్దుల నుంచి పిల్లల వరకు అంతా గుమిగూడి ఉన్నారు. దీంతో వీడియో మొదలవుతుంది. పిల్లలు ఉత్సాహంతో ముందుకు వంగి చూస్తున్నారు.
తలపాగా ధరించిన వృద్ధులు దండలు పట్టుకుని ఉన్నారు. యువకులు స్మార్ట్ ఫోన్‌లు చేతిలో పట్టుకుని వీడియో, ఫొటోలు తీసేందుకు సిద్ధంగా ఉన్నారు. డప్పు కొట్టేందుకు కూడా రెడీగా ఉన్నారు. తొలుత చూడగానే.. రాజకీయ నాయకుడు, వీఐపీ, సినిమా హీరో వస్తున్నారు.. అందుకే వీరంతా.. వారి కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఉంది.
కానీ అంతలోనే బ్లూ, తెలుపు రంగులో ఉన్న రాజస్థాన్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన బస్సు మలుపు తిరుగుతుంది. దాంతో అక్కడ ఉన్నవారి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఆ బస్సు వారి వద్ద ఆగడంతోనే.. వారంతా చుట్టూ చేరడంతో.. వీడియో ముగుస్తుంది. ఆ బస్సును పూలతో అలంకరించారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఈ గ్రామానికి సాధారణ ఆర్టీసీ బస్సు నేరుగా తమ గ్రామానికి రాలేదని గ్రామస్థులు చెబుతున్నారు.
దీంతో కొన్ని దశాబ్దాలుగా వైద్య చికిత్స, విద్య, పని కోసం నగరానికి వెళ్లడానికి మైళ్ల దూరం నడవాల్సి వచ్చేది లేదా ప్రైవేట్ వాహనాలపై ఆధారపడాల్సి వచ్చేందని వారు వివరించారు. దీంతో చాలా ఇబ్బందులు పడ్డామని వారు వెల్లడించారు. ప్రభుత్వ బస్సు రావడంతో.. ఈ కష్టాలకు ఫుల్ స్టాప్ పడిందని చెబుతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
దాంతో కొన్ని గంటల్లోనే వైరల్‌గా మారింది. ఫూఫాజీ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇప్పటి వరకు లక్షలాది మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కనీస సౌకర్యాన్ని కల్పించడంతో గ్రామస్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని పేర్కొన్నారు. గ్రామస్థుల అమాయకత్వం మరోసారి చాటిందని పలువురు అభిప్రాయపడ్డారు.
ఇవీ చదవండి:
కుక్కలే ఫీల్డర్లు.. కొండల్లో చిన్నారుల క్రికెట్ సందడి.. నెటిజన్ల ఫిదా
'ఓ మై డాగ్' స్క్రీనింగ్‌లో అనూహ్య ఘటన.. ధైర్యంగా ఎదుర్కొన్న రవీనా
For More Viral News And Telugu News