'ఓ మై డాగ్' స్క్రీనింగ్‌లో అనూహ్య ఘటన.. ధైర్యంగా ఎదుర్కొన్న రవీనా
ABN , Publish Date - Aug 07 , 2026 | 05:46 PM
ముంబైలో జరిగిన 'ఓ మై డాగ్' మూవీ స్పెషల్ ఆడిషన్ వేదికపై ఓ శునకం అనూహ్యంగా ప్రతిఘటించగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సమయస్ఫూర్తితో వ్యవహరించింది. దీనిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ముంబైలో 'ఓ మై డాగ్' మూవీ స్పెషల్ ఆడిషన్ జరిగింది. ఆ వేదికపై ఓ శునకం అనూహ్యంగా ప్రతిఘటించగా.. బాలీవుడ్ నటి రవీనా టాండన్ సమయస్ఫూర్తితో వ్యవహరించింది. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఆమె ధైర్యంగా ఎదుర్కొన్న విధానంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలేం జరిగిందంటే...
రెడ్ కార్పెట్‌పై ఏర్పాటుచేసిన ఈ వేదికపై పసుపు రంగు దుస్తుల్లో మెరిసింది రవీనా టాండన్. స్టేజ్‌పై తీసుకొచ్చిన ఓ శునకాన్ని ఆప్యాయంగా నిమురుతూ ఫొటోకు ఫోజులిచ్చంది. ఆమె లేచే సమయంలో డ్రస్ చేతి భాగంలో ఉన్న దారంపై కన్నేసిన కుక్క.. దాన్ని నోటితో పట్టుకుని మొరిగింది. అప్రమత్తమైన రవీనా.. వెంటనే తన చేతిని వెనక్కి లాక్కుంది. ఆ సమయంలో ఆమె చేతినే కరిచినంత పనిచేసిందా శునకం. ఈ అనూహ్య ఘటనలో ఏమాత్రం భయపడకుండా ధైర్యాన్ని ప్రదర్శించింది రవీనా. కుక్కను తోసేయకుండా పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ ఓపిగ్గా వేచి చూసింది. అనంతరం మళ్లీ అదే కుక్కను ప్రేమగా నిమిరి జంతుప్రేమను చాటుకుంది.
ఆ తర్వాత మీడియా ప్రతినిధులు ఆమెకు ఏమైనా గాయాలయ్యాయా అని ప్రశ్నించగా.. లేదని సమాధానమిచ్చింది రవీనా. మరో కుక్కను చూసి అలా మొరిగిందని, ఆ సమయంలో అనుకోకుండా తన డ్రస్ దారం దాని నోటికి దొరకడంతో ఇలా జరిగిందని చెప్పుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఓ యూజర్ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అది నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆమె సమయస్ఫూర్తితో వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
'ఓ మై డాగ్' విశేషాలు
దర్శకుడు అమిత్ రాయ్ తెరకెక్కించిన 'ఓ మై డాగ్' చిత్రాన్ని అస్సాం, బిహార్ రాష్ట్రాల్లో షూట్ చేశారు. ఈ సినిమా చిత్రీకరణలో జంతువులతో పని చేయడం సవాలుగా మారిందని దర్శకుడు తెలిపాడు. ముఖ్యంగా 200కు పైగా శిక్షణ లేని వీధి కుక్కలు.. అంబులెన్స్‌లను వెంబడించే ఓ సన్నివేశాన్ని షూట్ చేసేందుకు ప్రత్యేకంగా ప్లాన్ చేశామన్నాడు. వీధి కుక్కలకు ఆహారం అందించే ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో పలుమార్లు ప్రాక్టీస్ చేసి ఆ సన్నివేశాన్ని విజయవంతంగా తెరకెక్కించినట్లు చెప్పాడు. ఈ చిత్రంలో పంకజ్ త్రిపాఠి సహా పవన్ మల్హోత్రా, మాహి రాయ్, రాజేశ్ కుమార్, గీతా అగర్వాల్, విజయ్ మిశ్రా, శ్రీధర్ దూబే, బుల్లో కుమార్, సులాఖ్యానా బరువా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
ఇవీ చదవండి:
తమిళనాడు సీఎం విజయ్, సంగీత విడాకుల కేసులో కీలక మలుపు
ఆందోళన వద్దు.. నేను మీతోనే ఉన్నా: ప్రధాని మోదీ