Minister Seethakka: కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదు: మంత్రి సీతక్క
ABN , Publish Date - Jan 16 , 2026 | 03:47 PM
కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తోందని ఆమె వ్యాఖ్యానించారు.
రాజన్న సిరిసిల్ల, జనవరి16 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని పట్టించుకోలేదని తెలంగాణ పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క(Minister Seethakka) ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆలయాన్ని ఎంతగానో అభివృద్ధి చేస్తోందని వ్యాఖ్యానించారామె. వేములవాడ మున్సిపల్ పరిధిలోని తిప్పాపూర్ జంక్షన్ అభివృద్ధికి శుక్రవారం శంకుస్థాపన చేశారు మంత్రి. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. బీఆర్ఎస్ హయాంలో వేములవాడ రాజన్న ఆలయాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిధులు కేటాయించాం..
మేడారం సమ్మక్క - సారక్క, వేములవాడ ఆలయాల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి ఏకకాలంలోనే నిధులు కేటాయించారని ప్రస్తావించారు మంత్రి. సమ్మక్క - సారలమ్మ చరిత్ర, ప్రత్యేకతను శిలలపై రాయిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో రాజన్నను దర్శించుకుంటే నష్టం అంటూ దుష్ప్రచారాలు చేశారని అన్నారు. వేములవాడ రాజన్నను ఎంతోమంది భక్తులు తమ ఇంటి ఇలవేల్పుగా కొలుస్తారని తెలిపారు సీతక్క.
ప్రస్తుతం.. వేములవాడకు భారీగా భక్తులు తరలివచ్చి రాజన్నకు మొక్కులు సమర్పిస్తుంటారని పేర్కొన్నారు. రాజన్నపై నమ్మకంతోనే ఇంతమంది భక్తులు ఆలయానికి వస్తున్నారని వెల్లడించారు. కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా స్వామివారిని భక్తులు కొలుస్తుంటారని తెలిపారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, తాను వేములవాడ రాజన్నను దర్శించుకున్నామని గుర్తుచేశారు. అలాగే, మేడారం సమ్మక్క - సారక్క అమ్మవార్ల నుంచి పాదయాత్ర ప్రారంభించామని తెలిపారు. ఏ దేవాలయాల ప్రత్యేకత వాటికి ఉంటుందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది
సంక్రాంతి వేళ దొంగల హల్‌చల్.. చెంగిచెర్లలో భారీ చోరీలు
Read Latest Telangana News And Telugu News