Sankranti Return Journey: సంక్రాంతి రిటర్న్ జర్నీకి పోలీసుల ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Jan 16 , 2026 | 12:22 PM
సంక్రాంతి రిటర్న్ జర్నీలో రద్దీ నివారణకు హైదరాబాద్ వెళ్లే వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. 65వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ పనుల నేపథ్యంలో ప్రత్యేక ట్రాఫిక్ చర్యలు చేపట్టారు.
నల్లగొండ, జనవరి 16: సంక్రాంతి రిటర్న్ జర్నీకి నల్గొండ జిల్లా పోలీసులు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టారు. హైదరాబాద్ వెళ్లే వాహనాల రద్దీని నియంత్రించేందుకు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్(SP Sharat Chandra Pawar) ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ కంట్రోల్‌లో భాగంగా వాహనాలను దారి మళ్లించాలని డిసైడ్ అయ్యారు. 65వ జాతీయ రహదారిపై ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిట్యాల, పెద్దకాపర్తిలో బ్లాక్ స్పాట్స్ వద్ద నిర్మాణ పనులతో ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉందని.. ఈ కారణంగా ఆయా రూట్లలో వాహనాలను దారి మళ్లించనున్నట్లు పోలీసులు ప్రకటించారు. సొంతూళ్ల నుంచి తిరిగి హైదరాబాద్ చేరుకునే ప్రయాణికులు సురక్షితంగా, సాఫీగా ప్రయాణించాలనే లక్ష్యంతో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ పవార్ వెల్లడించారు.
ప్రత్యామ్నాయ మార్గాలు:
గుంటూరు – మిర్యాలగూడ – హాలియా – చింతపల్లి – మాల్ మీదుగా హైదరాబాద్
మాచర్ల – నాగార్జునసాగర్ – పెద్దఊర – చింతపల్లి – మాల్ మీదుగా హైదరాబాద్
నల్లగొండ – మార్రిగూడ బైపాస్ – మునుగోడు – నారాయణపూర్ – చౌటుప్పల్(NH-65) మీదుగా హైదరాబాద్
విజయవాడ నుంచి..:
కోదాడ – హుజూర్‌నగర్ – మిర్యాలగూడ – హాలియా – చింతపల్లి – మాల్ మీదుగా హైదరాబాద్
ట్రాఫిక్ జామ్ ఏర్పడితే చిట్యాల నుంచి భువనగిరి మీదుగా వాహనాలను మళ్లించే ఏర్పాట్లు చేశారు.
కాగా.. సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రజలు తమ తమ స్వగ్రామాలకు వెళ్లిపోయారు. దీంతో టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ రద్దీ పెరిగింది. హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్ ప్లాజా వంటి చోట్ల భారీ రద్దీ నెలకొంది. కేవలం 5 రోజుల్లోనే 3 లక్షలకు పైగా వాహనాలు హైవే మీదుగా ప్రయాణించాయి. అందులో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు సుమారు 2.04 లక్షల వాహనాలు ప్రయాణించాయి. గత శనివారం ఒక్కరోజులోనే 71 వేలకు పైగా వాహనాలు ఆ మార్గం గుండా వెళ్లాయి. పంతంగి టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరినప్పటికీ.. ఫాస్టాగ్ స్కానింగ్ వేగవంతం చేయడం, అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్ సాఫీగా సాగింది.
ఇవి కూడా చదవండి...
ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది
హాట్ ఎయిర్ బెలూన్ షో.. ఆకాశంలో రంగురంగుల బెలూన్ల కనువిందు
Read Latest Telangana News And Telugu News