Share News

Hot Air Balloon Festival: హాట్ ఎయిర్‌ బెలూన్ షో.. ఆకాశంలో రంగురంగుల బెలూన్ల కనువిందు

ABN , Publish Date - Jan 16 , 2026 | 11:02 AM

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నేటి నుంచి జనవరి 18వ తేదీ వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ జరునుగంది. మంత్రి జూపల్లి కృష్ణారావు బెలూన్‌ షోను ప్రారంభించారు.

Hot Air Balloon Festival: హాట్ ఎయిర్‌ బెలూన్ షో.. ఆకాశంలో రంగురంగుల బెలూన్ల కనువిందు
Hot Air Balloon Festival

హైదరాబాద్, జనవరి 16: తెలంగాణలో తొలిసారిగా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ (Hot Air Balloon Festival) నిర్వహిస్తున్నారు. సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ వేదికగా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈ షో జరుగనుంది. తెలంగాణ పర్యాటక, సంస్కృతి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally Krishna Rao) ఈ హాట్ ఎయిర్ బెలూన్ షోను ప్రారంభించారు. ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకున్న 300 మంది సందర్శకులకు హాట్ ఎయిర్ బెలూన్లలో రైడ్‌కు అనుమతి ఇవ్వనున్నారు. అలాగే సాధారణ ప్రేక్షకులకు నైట్ గ్లో షో ఓపెన్‌గా ఉండనుంది. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌ టికెట్‌ను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. వయస్సు, రైడ్ రకాన్ని బట్టి ధరలు రూ.500 నుంచి రూ.1500 వరకు ఉండనున్నాయి.


కాగా.. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా జనవరి 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్ & స్వీట్స్ ఫెస్టివల్‌ను నిర్వహించిన విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో సందర్శకులు కైట్ ఫెస్టివల్‌లో పాలుపంచుకున్నారు. అలాగే జనవరి 16, 17 తేదీల్లో గచ్చిబౌలి స్టేడియంలో డ్రోన్ ఫెస్టివల్‌, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో జనవరి 16 నుంచి 18 వరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది హైదరాబాద్‌లో తొలి హాట్ ఎయిర్ బెలూన్ ఈవెంట్‌గా రికార్డు సృష్టిస్తోంది. పరేడ్ గ్రౌండ్‌లో సాయంత్రం 4 గంటల నుంచి రంగురంగుల బెలూన్లు ఆకాశంలో కనువిందు చేయనున్నాయి.


ఇవి కూడా చదవండి...

వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు.. సుప్రీం ఏం తేల్చనుంది

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 16 , 2026 | 11:25 AM