రాబోయే ఎన్నికల్లో వందశాతం రేవంత్‌రెడ్డి ఓడిపోతారు: ఎంపీ ఈటల
ABN , Publish Date - Nov 26 , 2026 | 05:11 PM
సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు.
కరీంనగర్ జిల్లా, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేపీ మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ ( BJP MP Etala Rajender) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి భ్రమల్లో బతుకుతున్నారని ఎద్దేవా చేశారు. ఈరోజు (గురువారం) హుజురాబాద్‌లో ఎంపీ ఈటల పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో 100 శాతం రేవంత్‌రెడ్డి ఓడిపోతారని విమర్శించారు. 90 శాతం సీట్లు వస్తాయని ఆయన భ్రమ పడుతున్నారని వ్యంగ్యంగా మాట్లాడారు.
10 నుంచి 15 ఏళ్ల దాకా కాంగ్రెస్ అధికారంలోకి రాదని.. ఆ పార్టీ కార్యకర్తలే అంటున్నారని ఈటల రాజేందర్ చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రజా సమస్యలు కాంగ్రెస్ సర్కార్ పట్టడం లేదని ధ్వజమెత్తారు. ఐకేపీ కేంద్రాలను తెరిచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. హుజురాబాద్‌లో తట్టెడు మట్టి పోయలేదని తనను విమర్శించే వాళ్లు.. తాను ఎమ్మెల్యేగా ఉండగా ఏర్పాటు చేసిన చెక్ డ్యాములు, స్కూళ్లు, రోడ్లు, హాస్పిటళ్లు చూడాలని తెలిపారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో రూ.1000 కోట్ల నిధులు తెస్తానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌషిక్‌రెడ్డి చిన్న పిల్లలతో చెప్పించారని.. ఎందుకు అమలు చేయట్లేదని నిలదీశారు. ఎన్నికలప్పుడు ఆయన కన్నీళ్లు పెట్టుకొని, చచ్చిపోతామని బ్లాక్ మెయిల్ చేశారని ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఖేలో ఇండియా గేమ్స్.. క్వాలిటీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించం: సీఎం రేవంత్‌రెడ్డి
టెక్నాలజీతో పోలీస్ సేవలు మరింత వేగవంతం: డీజీపీ
నాగర్ కర్నూల్ జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వరాలు.. రూ.450 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News