టెక్నాలజీతో పోలీస్ సేవలు మరింత వేగవంతం: డీజీపీ
ABN , Publish Date - Nov 25 , 2026 | 02:40 PM
టెక్నాలజీతో పోలీస్ సేవలను మరింత వేగవంతం చేస్తున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఏఐతో పోలీస్ సేవల్లో కొత్త మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): టెక్నాలజీతో పోలీస్ సేవలను మరింత వేగవంతం చేస్తున్నామని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (Telangana DGP CV Anand) స్పష్టం చేశారు. ఏఐతో పోలీస్ సేవల్లో కొత్త మార్పులు వస్తున్నాయని పేర్కొన్నారు. మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్టను ఎంపిక చేశామని తెలిపారు. ఈరోజు (బుధవారం) పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌ను డీజీపీ సందర్శించారు. ఏఐ పోలీస్ స్టేషన్ పనితీరును పరిశీలించారు. అడిషనల్ డీజీపీ అకూన్ సబర్వాల్, హైదరాబాద్ సీపీ మహేశ్ భగవత్‌తో కలిసి పరిశీలించారు.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏఐ వ్యవస్థ..
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడారు. పైలట్ ప్రాజెక్టుగా తొలిసారిగా పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏఐ వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పోలీస్ అధికారుల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఆయా ఫిర్యాదులను స్వీకరిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఏఐ యంత్రం ముందు బాధితులు తమ సమస్యను వివరిస్తే చాలని తెలిపారు. బాధితులు చెప్పిన వివరాలతో ఫిర్యాదు కాపీ సిద్ధం అవుతుందని అన్నారు. ఆటోమేటిక్‌గా సంబంధిత పోలీస్ అధికారులకు ఫిర్యాదులు చేరుతాయని వివరించారు. టెక్నాలజీతో పోలీస్ సేవలను మరింత వేగవంతం చేసే దిశగా చర్యలు చేపట్టామని డీజీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మూసీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు సీఎం ఆదేశం
మహిళలకు సీఎం రేవంత్‌రెడ్డి కానుక.. కోటి ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం
హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి పాదయాత్ర.. 20 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News