Share News

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి పాదయాత్ర.. 20 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:59 PM

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో భాగ్యనగరంలో బుధవారం భారీ పాదయాత్ర నిర్వహించనున్నారు. నషా ముక్త్ భారత్ నినాదంతో 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' పాదయాత్ర చేపట్టనున్నారు.

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి పాదయాత్ర.. 20 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
Hyderabad Nasha Mukt Bharat Rally

హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) ఆధ్వర్యంలో భాగ్యనగరంలో రేపు (బుధవారం) భారీ పాదయాత్ర నిర్వహించనున్నారు. నషా ముక్త్ భారత్ నినాదంతో 'హైదరాబాద్ వాక్స్ ఫర్ నషా ముక్త్ భారత్' పాదయాత్ర చేపట్టనున్నారు. అంబర్‌పేట్ ఎంసీహెచ్ గ్రౌండ్ నుంచి ముషీరాబాద్‌లోని కాశిష్ ఫంక్షన్ హాల్ వరకు ఈ పాదయాత్ర కొనసాగనుంది. ఈ పాదయాత్రలో బుధవారం ఉదయం నుంచి భారీగా ప్రజలు పాల్గొనే అవకాశం ఉండటంతో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు.అవసరాన్ని బట్టి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులను పోలీసులు అమలు చేయనున్నారు.


మహంకాళి టెంపుల్ అంబర్‌పేట్ నుంచి అంబర్‌పేట్ టీ జంక్షన్, 6 నంబర్ జంక్షన్ మీదుగా పాదయాత్ర కొనసాగనుంది. తిలక్‌నగర్, ఫీవర్ హాస్పిటల్, హిందీ మహావిద్యాలయ, విద్యానగర్ మీదుగా ర్యాలీ జరగనుంది. ఎన్సీసీ జంక్షన్, ఉస్మానియా యూనివర్సిటీ ఎన్సీసీ గేట్, ఓయూ ఆర్ట్స్ కాలేజ్, ఇఫ్లూ మీదుగా ఈ పాదయాత్ర ముందుకు సాగనుంది. సీతాఫల్‌మండి, చిలకలగూడ X రోడ్, పద్మారావునగర్ టీ జంక్షన్ మీదుగా గాంధీ హాస్పిటల్‌కు ఈ ర్యాలీ చేరుకోనుంది. అక్కడి నుంచి ముషీరాబాద్ X రోడ్ మీదుగా కాశిష్ ఫంక్షన్ హాల్ వద్ద ముగియనుంది.


మొత్తం 20 ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు, ప్రత్యామ్నాయ మార్గాలను ట్రాఫిక్ పోలీసులు సూచించారు. అంబర్‌పేట్, తిలక్‌నగర్, విద్యానగర్, ఎన్సీసీ జంక్షన్, సీతాఫల్‌మండి ప్రాంతాల్లో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముషీరాబాద్, ఆర్టీసీ X రోడ్, చిక్కడపల్లి, అశోక్‌నగర్ ప్రాంతాల్లోనూ ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశాలు ఉన్నాయి. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 07:02 PM