Share News

మహిళలకు సీఎం రేవంత్‌‌రెడ్డి కానుక.. కోటి ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం

ABN , Publish Date - Nov 24 , 2026 | 06:20 PM

తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనుంది. ఈ నెల 26వ తేదీన అచ్చంపేటలో పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ప్రారంభించనున్నారు.

మహిళలకు సీఎం రేవంత్‌‌రెడ్డి కానుక.. కోటి ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం
Telangana GOVT

హైదరాబాద్, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం కోటి మంది మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలను పంపిణీ చేయనుంది. ఈ నెల 26వ తేదీన అచ్చంపేటలో పంపిణీని ముఖ్యమంత్రి రేవంత్‌‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా చీరల పంపిణీ చేయనున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షలు.. పట్టణ ప్రాంతాల్లో 35 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఆకర్షణీయమైన చిలుకపచ్చ రంగులో ప్రత్యేకంగా చీరలను కాంగ్రెస్ సర్కార్ తయారీ చేసింది.


95 లక్షల పాలిస్టర్.. 5 లక్షల పాలీకాటన్ చీరలను రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయనుంది. తెలంగాణలోని నేత కార్మికులతోనే ఈ చీరలను సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తయారీ చేసింది. ఇందుకోసం రేషన్ కార్డు ఉన్న కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన మహిళలను అర్హులుగా ప్రకటించింది. ఆధార్, ఆహార భద్రత కార్డు వివరాలతో ఈ చీరలను పంపిణీ చేయనుంది. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా లబ్ధిదారుల వివరాలను నమోదు చేయనుంది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఇన్‌చార్జి మంత్రుల ఆధ్వర్యంలో పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం చేపట్టనుంది.


ఈ వార్తలు కూడా చదవండి...

కేసీఆర్ హయాంలోనే పల్నాడు వాటర్‌ గ్రిడ్‌‌కు బీజం పడింది.. సీఎం రేవంత్ ధ్వజం

పార్టీ ఫిరాయింపుల చట్టంపై కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 07:17 PM