Share News

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

ABN , Publish Date - Nov 25 , 2026 | 03:19 PM

తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్, వరంగల్ - ఖమ్మం - నల్గొండ నియోజకవర్గాలకు జాబితాను ప్రచురించింది.

తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
Telangana MLC Elections

హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గాల ముసాయిదా ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్, వరంగల్ - ఖమ్మం - నల్గొండ నియోజకవర్గాలకు జాబితాను ప్రచురించింది. రెండు నియోజకవర్గాల్లో కలిపి 12,69,191 దరఖాస్తులను స్వీకరించినట్లు తెలిపింది. వీటిలో 11,89,191 దరఖాస్తులను అర్హమైనవిగా గుర్తించింది. 80,635 దరఖాస్తులను అనర్హమైనవిగా తిరస్కరించింది. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్‌లో 5,68,105 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారని పేర్కొంది.


వరంగల్ - ఖమ్మం - నల్గొండలో - 6,21,086 మంది అర్హులైన ఓటర్లు ఉన్నారని తెలంగాణ ఎన్నికల సంఘం తెలిపింది. రెండు నియోజకవర్గాల్లో పురుష ఓటర్లు - 7,10,652.. మహిళా ఓటర్లు - 4,78,528 ఉన్నారని చెప్పింది. మొత్తం - 1,703 పోలింగ్ కేంద్రాలను ఈసీ ఆమోదించింది. ముసాయిదా జాబితాపై అభ్యంతరాలు, దరఖాస్తుల స్వీకరణకు డిసెంబరు 10వ తేదీ వరకు గడువు విధించింది. ఈ జాబితాలో పేరు లేని అర్హులైన పట్టభద్రులు ఫారం-18 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.


ఈ వివరాల సవరణకు ఫారం-8.. పేర్ల తొలగింపుపై అభ్యంతరాలకు ఫారం-7లను సమర్పించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆయా వివరాలతో సీఈవో తెలంగాణ వెబ్‌సైట్‌లో ఓటర్ల జాబితా అందుబాటులో ఉంటుందని చెప్పింది. డిసెంబరు 25వ తేదీలోగా అభ్యంతరాలను పరిష్కరించనున్నట్లు తెలిపింది. డిసెంబర్ 30వ తేదీన ఇందుకు సంబంధించిన తుది ఓటర్ల జాబితాను విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ఎన్నికల సంఘం పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి...

మూసీ ప్రాజెక్టు పనుల్లో వేగం పెంచండి.. అధికారులకు సీఎం ఆదేశం

మహిళలకు సీఎం రేవంత్‌‌రెడ్డి కానుక.. కోటి ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం

హైదరాబాద్‌లో కిషన్‌రెడ్డి పాదయాత్ర.. 20 ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 25 , 2026 | 03:39 PM