Share News

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్.. 12న మంత్రులతో కీలక భేటీ

ABN , Publish Date - Oct 09 , 2026 | 06:20 PM

ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పెషల్ ఫోకస్​ పెట్టారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై సీఎం అక్టోబర్ 12వ తేదీన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.

తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ యాక్షన్ ప్లాన్.. 12న మంత్రులతో కీలక భేటీ
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో పరిస్థితులపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Telangana CM Revanth Reddy) స్పెషల్ ఫోకస్​ పెట్టారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై సీఎం అక్టోబర్ 12వ తేదీన మంత్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులకు, అధికారులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. వర్షపాతం తగ్గిన ప్రాంతాల్లో పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వం చేపట్టాల్సిన తక్షణ చర్యలపై చర్చించనున్నారు.


వ్యవసాయం, సాగునీరు, తాగునీటి సరఫరా, పెరిగిన విద్యుత్ డిమాండ్, తక్షణ అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. దాదాపు 235 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు.


కరవు మండలాల ప్రకటనతో పాటు తగినంత ఆర్థిక సాయం అందించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. రూ.20 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. వర్షాభావ ప్రాంతాల్లో చేపట్టాల్సిన సహాయక చర్యలు, ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం రూపొందించిన కార్యాచరణ, అఖిలపక్ష సమావేశం, రైతు సంఘాలు, వివిధ రంగాల నిపుణుల సలహాలు, సూచనలపై ఈ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి చర్చించే అవకాశం ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఈసీ, కేంద్ర విధానాలపై మా పోరాటం ఆగదు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణను అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి: సీఎస్

మహిళా సాధికారతకు కొత్త అడుగు.. జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు: సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 06:28 PM