Share News

మోదీ రావణుడు.. మేం వానరసైన్యం!

ABN , Publish Date - Nov 02 , 2026 | 03:12 AM

మోదీ రావణుడు అని, ఆయన్ను గద్దె దించి.. గుజరాత్‌కు పంపేదాకా విశ్రమించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. మోదీని ఓడించేందుకు తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తల రూపంలో వానరసైన్యం ఢిల్లీకి వచ్చిందన్నారు.

మోదీ రావణుడు.. మేం వానరసైన్యం!
Revanth Reddy

  • మోదీని గద్దె దించేసి గుజరాత్‌కు పంపేస్తాం..

  • పేదలను లక్ష్యంగా చేసుకొనే ఓట్‌ చోరీ

  • ఇప్పటికే 13.5 కోట్ల ఓట్లు తొలగించారు

  • మరో 7 కోట్ల ఓట్లు తీసేసి దొడ్డిదారిన అధికారంలోకి రావాలని కుట్ర: రేవంత్‌

  • జ్ఞానేశ్‌ను ఇంటికి పంపేసి ప్రజలకు మోదీ క్షమాపణ చెప్పాలి: మహేశ్‌ గౌడ్‌

  • ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఐదారేళ్లుగా రాహుల్‌ హెచ్చరిస్తున్నారు: భట్టి

న్యూఢిల్లీ, నవంబరు 1(ఆంధ్రజ్యోతి): మోదీ రావణుడు అని, ఆయన్ను గద్దె దించి.. గుజరాత్‌కు పంపేదాకా విశ్రమించేది లేదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. మోదీని ఓడించేందుకు తెలంగాణ నుంచి కాంగ్రెస్‌ కార్యకర్తల రూపంలో వానరసైన్యం ఢిల్లీకి వచ్చిందన్నారు. రాహుల్‌ గాంధీ నేతృత్వంలోని ఇండీ కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు ముందు తెలంగాణ భవన్‌లో పార్టీ శ్రేణులను ఉద్దేశించి రేవంత్‌ మాట్లాడారు. మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పేద ప్రజలను లక్ష్యంగా చేసుకొని వారి ఓట్లను తొలగిస్తున్నారని రేవంత్‌ ఆరోపించారు. సీఈసీగా జ్ఞానేశ్‌ కుమార్‌ను నియమించి ఇప్పటికే దేశంలో 13.5 కోట్ల ఓట్లు తొలగించారని.. రానున్న రోజుల్లో మరో 7కోట్ల ఓట్లు తొలగించి.. దొడ్డిదారిన అధికారంలోకి రావాలని బీజేపీ కుట్ర పన్నుతోందని రేవంత్‌ ఆరోపించారు. ఓట్‌ చోరీ ద్వారా మహారాష్ట్ర, బిహార్‌, బెంగాల్‌లో ఇప్పటికే బీజేపీ లాభపడిందని విమర్శించారు.


Untitled-1 copy.jpgతెలంగాణ బలాన్ని, గళాన్ని ఢిల్లీలో గట్టిగా వినిపించేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ నేతృత్వంలో 15వేల మంది కార్యకర్తలను ప్రత్యేక రైళ్లలో తరలించేందుకు ఏర్పాట్లు చేశామని.. కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరించి, రైళ్లను రద్దు చేసిందని తీవ్రంగా ఆక్షేపించారు. ‘‘మీరు రైళ్లను ఆపగలిగారేమో కానీ, తెలంగాణ ప్రజల సంకల్పాన్ని ఆపలేకపోయారు. మా బలమైన గళం ముందు మోదీ, అమిత్‌ షా, సీఈసీ జ్ఞానేశ్‌ తలవంచక తప్పదు’’ అని వ్యాఖ్యానించారు. ఉన్నత వర్గాలకే ఓటు హక్కు ఉండాలనేది బీజేపీ మతోన్మాద సిద్ధాంతం అని పేర్కొన్నారు. ప్రజలే పాలకులను ఎన్నుకునేందుకు అప్పట్లో 30కోట్ల జనాభాకు ఓటు హక్కును కల్పించారని వివరించారు. ఉన్నత వర్గాలకే ఓటు హక్కు ఉండాలని అప్పట్లో బీజేపీ మతోన్మాద శక్తులు వాదించాయని.. అయితే దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలకు అంబేడ్కర్‌ సమాన ఓటు హక్కు అందించారని తెలిపారు. మూడోసారి.. 400 సీట్లతో గనక అధికారంలోకొస్తే రాజ్యాంగాన్ని రద్దు చేసి, రిజర్వేషన్లు ఎత్తివేసి, పేదల ఓటు హక్కును తొలగించాలని మోదీ కుట్ర పన్నారని, ఆ విషయాన్ని గ్రహించిన ప్రజలు 240 సీట్లకే పరిమితం చేశారని చెప్పారు.


బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రతి ఒక్క కార్యకర్త పల్లెపల్లెకూ చేరవేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీ సభకు దేశంలోనే అత్యధికంగా తెలంగాణ నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేసిన మహేశ్‌ గౌడ్‌ను రేవంత్‌ ప్రత్యేకంగా అభినందించారు. కాగా ఓట్‌ చోరీతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తూ ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షాలు చరిత్రలో ఎన్నడూ చూడని అరాచకాలకు తెరలేపారని ఆరోపించారు. మోదీ, అమిత్‌ షాలు సీఈసీ జ్ఞానేశ్‌ను పదవి నుంచి ఇంటికి పంపాలని, దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాగా ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా నిర్వహించాల్సిన బాధ్యతగల ఎన్నికల సంఘం.. బీజేపీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు.


సీఈసీ తమ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదని స్వయంగా కమిషనర్లే పేర్కొనడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనమన్నారు. ఐదారేళ్లుగా ఓటర్ల జాబితా అక్రమాలపై రాహుల్‌ హెచ్చరిస్తున్నారని, ప్రతి నియోజకవర్గంలో 20 వేల నుంచి 25వేల ఓట్లు తొలగించి ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశారని ఆరోపించారు. ఓట్‌చోరీతోనే కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిందని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. జాబితా నుంచి ఓట్లు తొలగిస్తున్న జ్ఞానేశ్‌కు శిక్షపడక తప్పదని మంత్రి వివేక్‌ అన్నారు. ఓట్ల చోరీకి పాల్పడిన వారిని కేంద్రం కాపాడుతోందని మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఈసీ జ్ఞానేశ్‌ను వెనుకేసుకొచ్చే ప్రయత్నాన్ని మోదీ మానుకోవాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 02 , 2026 | 03:20 AM