నిందితుల బంగారం పోలీసు తాకట్టు
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:58 AM
ఓ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలను తాకట్టు పెట్టి ఏకంగా రూ.12.37లక్షలు రుణం తీసుకున్నాడో కానిస్టేబుల్! అంతేనా.. నిందితుడి మొబైల్ నుంచి యూపీఐ ద్వారా రూ.1.70లక్షలు సైతం లాగేసుకున్నాడు.
హైదరాబాద్‌లోని మీర్‌పేట్ కానిస్టేబుల్ శ్రావణ్ నిర్వాకం
ఫైనాన్స్ కంపెనీల్లో పెట్టి రూ.12.37 లక్షల రుణం
ఓ నిందితుడి ఫోన్ నుంచి 1.70లక్షలు ట్రాన్స్‌ఫర్
కానిస్టేబుల్ అరెస్టు.. రిమాండ్
సరూర్‌నగర్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): ఓ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న బంగారు నగలను తాకట్టు పెట్టి ఏకంగా రూ.12.37లక్షలు రుణం తీసుకున్నాడో కానిస్టేబుల్! అంతేనా.. నిందితుడి మొబైల్ నుంచి యూపీఐ ద్వారా రూ.1.70లక్షలు సైతం లాగేసుకున్నాడు. ఈ వ్యవహారం బయటకు పొక్కడంతో పోలీసులు ఆ కానిస్టేబుల్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్‌లోని మీర్‌పేట్ ఇన్‌స్పెక్టర్ శోభన్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. జూలై 30న వినాయకహిల్స్‌కు చెంది న ఓ వివాహిత అదనపు కట్నం వేధింపులతో ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో విచారణ చేపట్టిన మీర్‌పేట్ పోలీసులు ఆమె భర్తతో పాటు మరి కొందరిని ఆరెస్టు చేసి జైలుకు పంపించారు. ఈ క్రమంలో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న 12.22 తులాల బంగారు నగలతో పాటు 5సెల్‌ఫోన్లను కానిస్టేబుల్ ఎన్.శ్రావణ్‌కుమార్‌కు అప్పగించారు.
వాటిని భద్రంగా దాచాల్సిన శ్రావణ్‌కుమార్.. ఆ ఆభరణాలను ముత్తూట్ ఫైనాన్స్‌తో పాటు మరో మూడు దుకాణాల్లో కుదువపెట్టి రూ.12.37లక్షలు రుణం తీసుకున్నాడు. మృతురాలి భర్తకు చెందిన మొబైల్ నుంచి దశలవారీగా ఆన్‌లైన్‌లో తన భార్య అకౌంట్‌కు రూ.1.37లక్షలు, స్నేహితుడు శివాజీకి రూ.33వేలు ట్రాన్స్‌ఫర్ చేశాడు. జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన నిందితులు బ్యాంకు ఖాతాను చెక్ చేయగా డబ్బు డ్రా అయినట్టు తెలియడంతో పోలీసులను ప్రశ్నించారు. పోలీసులు కానిస్టేబుల్ శ్రావణ్‌కుమార్‌ను అడుగగా తానే ఆ డబ్బును వాడుకున్నట్టు ఒప్పుకొన్నాడు. అనుమానంతో బంగారు నగల గురించి ప్రశ్నించగా వాటినీ తాకట్టు పెట్టినట్టు అంగీకరించాడు. తన తండ్రి వైద్య ఖర్చుల కోసం, కుటుం బ అవసరాల కోసం అప్పులయ్యాయని, అప్పుల భారం నుంచి బయటపడడానికే తాను ఇలా చేశానని శ్రావణ్ పేర్కొన్నట్టు ఇన్‌స్పెక్టర్ శోభన్ తెలిపారు. శ్రావణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News