ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తెలంగాణ
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:51 AM
ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు.
తయారీ రంగంలో 7.7 శాతం వృద్ధి: మంత్రి దుద్దిళ్ల
‘మివీ’ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ప్రారంభోత్సవం
యువతకు ఉపాధి కల్పించాలి: ఏపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల
మహేశ్వరం, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతామని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలోని ఈ-సిటీలో రూ.200 కోట్లతో ఏర్పాటు చేసిన మివీ (ఎంఐవీఐ) నూతన మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన మివీ సంస్థ ఇయర్‌బడ్స్, హెడ్‌ఫోన్స్, స్పీకర్లు, సౌండ్‌బార్లు తదితర ఆడియో ఉత్పత్తులను తయారు చేస్తోంది. తాజాగా వన్ 5జీ స్మార్ట్ ఫోన్‌తో మొబైల్ తయారీ రంగంలోకి మివీ అడుగు పెట్టింది. ఈ కేంద్రాన్ని ప్రారంభించిన తర్వాత మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ రాష్ట్ర ఫ్రభుత్వం తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యమిస్తోందన్నారు.
భవిష్యత్తు సవాళ్లను అవకాశాలుగా మలుచుకునేలా టెక్నాలజీ, ఇన్నోవేషన్, మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలను అనుసంధానిస్తూ కాంప్రహెన్సివ్ ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. మివీ ఫెసిలిటీ యూనిట్‌లో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2,500 మందికి ఉపాధి లభించనుందని పేర్కొన్నారు. కాగా, పెట్టుబడిదారులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని, ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఏపీకి చెందిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా పారిశ్రామికవేత్తలు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News