Share News

యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌కు రూ.42.5 లక్షల సీహటఆర్‌ విరాళాలు

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:59 AM

పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ అభివృద్ధికి మూడు కార్పొరేట్‌ సంస్ధలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రూ.42.5 లక్షల నిధులను విరాళంగా అందచేశాయి.

యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌కు రూ.42.5 లక్షల సీహటఆర్‌ విరాళాలు
Young India Police School

హైదరాబాద్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): పోలీసు సిబ్బంది పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన యంగ్‌ ఇండియా పోలీసు స్కూల్‌ అభివృద్ధికి మూడు కార్పొరేట్‌ సంస్ధలు కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రూ.42.5 లక్షల నిధులను విరాళంగా అందచేశాయి. కోహినూర్‌ గ్రూపుకు చెందిన ఏక్యూ స్క్వేర్‌ రియల్టర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ తరఫున సంస్థ ఈడీ మహ్మద్‌ అమ్జాద్‌ ఆయన కుమారుడు నిసార్‌ ఖాద్రీలు రూ.25లక్షల మొత్తానికి చెక్‌ను డీజీపీ సీవీ ఆనంద్‌కు శనివారం అందచేశారు.


పుజ్జోలానా మెషినరీ ఫ్రాబ్రికేషన్స్‌ తరఫున సంస్థ ఎండీ ఆదిత్య పాయ్‌ రూ.10 లక్షలు అందించారు. దివ్యశక్తి గ్రూపు తరఫున రవీంద్ర కుమార్‌ అగర్వాల్‌ రూ.7.5 లక్షల విరాళాన్ని డీజీపీకి అందచేశారు. పోలీసు సిబ్బంది సమాజానికి అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించి వారి పిల్లల విద్యాభివృద్ధికి తోడ్పడాలనే ఉద్దేశ్యంతో ఈ విరాళాలు అందించినట్లు ఆయ సంస్ధల ప్రతినిధులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 05:59 AM