భూములు అమ్మిన చరిత్ర కేసీఆర్‌ది: మల్లు రవి
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:38 AM
బీఆర్‌ఎస్ హయాంలో విలువైన భూములు అమ్మిన చరిత్ర కేసీఆర్‌దని ఎంపీ మల్లు రవి ఆరోపించారు.
అక్కడ ఫుట్‌బాల్ స్టేడియం ఏర్పాటు చేయాలి: వీహెచ్
న్యూఢిల్లీ, అక్టోబరు 30(ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ హయాంలో విలువైన భూములు అమ్మిన చరిత్ర కేసీఆర్‌దని ఎంపీ మల్లు రవి ఆరోపించారు. విలువైన భూములు ఆక్రమణదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డిదని ఆయన గుర్తు చేశారు. శనివారం న్యూఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. మియాపూర్ భూములను తామే పరిరక్షించామని బీఆర్‌ఎస్ నేత హరీశ్ రావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
రేవంత్ రెండున్నరేళ్లలోనే లక్షల కోట్ల ప్రభుత్వ భూములను పరిరక్షించారని తెలిపారు. మరోవైపు మియాపూర్‌లోని 80ఎకరాల్లో ఫుట్‌బాల్ స్టేడియం, బహిరంగ సభలు నిర్వహించుకోవడానికి స్థలం కేటాయించాలని సీఎం రేవంత్‌కు తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ సలహాదారుడు వి.హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై త్వరలో ముఖ్యమంత్రిని స్వయంగా కలిసి మాట్లాడుతానని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News