Share News

మియాపూర్‌ భూముల కబ్జాకు కేసీఆర్‌ కుట్ర

ABN , Publish Date - Nov 01 , 2026 | 05:27 AM

మియాపూర్‌లోని అత్యంత ఖరీదైన 550 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదారులకు దక్కేలా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర చేసిందని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు, ఆది శ్రీనివాస్‌, అద్దంకి దయాకర్‌ విమర్శించారు.

మియాపూర్‌ భూముల కబ్జాకు కేసీఆర్‌ కుట్ర
Miyapur Land Scam

  • కాంగ్రెస్‌ నేతలు విజయరమణారావు, ఆది శ్రీనివాస్‌, అద్దంకి

హైదరాబాద్‌, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): మియాపూర్‌లోని అత్యంత ఖరీదైన 550 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాదారులకు దక్కేలా గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కుట్ర చేసిందని ప్రభుత్వ విప్‌ విజయరమణారావు, ఆది శ్రీనివాస్‌, అద్దంకి దయాకర్‌ విమర్శించారు. శనివారం వీరు గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. ఈ భూముల కేసులో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చరిత్రాత్మక విజయం లభించిందని తెలిపారు. సర్వే నంబర్లు 100, 101లోని ఈ భూములు ప్రభుత్వానికే చెందుతాయని రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదన వినిపించటం వల్లే సుప్రీంకోర్టులో ఈ విజయం దక్కిందని చెప్పారు.


హైడ్రా ఇప్పటివరకు రూ.1.5లక్షల కోట్ల విలువైన భూములను కాపాడిందని, హైడ్రా పునరుద్ధరించిన చెరువులు ఇప్పుడు నీళ్లతో కళకళలాడుతున్నాయని తెలిపారు. కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నాయకులు హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని విలువైన భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. మియాపూర్‌ భూముల విషయంలో దామోదర్‌రావుకు ముందుగానే విలాసవంతమైన కార్లను లంచంగా ఇచ్చారనే ఆరోపణలున్నాయన్నారు. ఇలాంటి వాళ్లు సిగ్గు లేకుండా మియాపూర్‌ భూములను తామే కాపాడామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైస్పీడ్ రైళ్ల మార్గాల ప‌నులను వేగ‌వంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం

ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి

ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Nov 01 , 2026 | 05:27 AM