13 మంది మున్సిపల్ అధికారులపై విచారణ
ABN , Publish Date - Nov 01 , 2026 | 05:55 AM
రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో వాహనాలు, తుక్కు, వినియోగానికి పనికిరాని వాహనాలకు సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 13 మంది పురపాలక శాఖ అధికారులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.
వాహనాల కొనుగోళ్లు, తుక్కు విక్రయాల్లో అక్రమాలపై సీరియస్
హైదరాబాద్, అక్టోబరు 31(ఆంధ్రజ్యోతి): రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో వాహనాలు, తుక్కు, వినియోగానికి పనికిరాని వాహనాలకు సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 13 మంది పురపాలక శాఖ అధికారులపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి శనివారం ఉత్తర్వులిచ్చారు. వీరంతా తుక్కు, కండెమ్న్‌డ్ వాహనాలకు సంబంధించిన రిజిస్టర్ల నిర్వహణను పర్యవేక్షించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విజిలెన్స్ నివేదికలో పేర్కొంది.
విచారణ ఎదుర్కొంటున్న వారిలో మున్సిపల్ కమిషనర్లు బి.శ్రీనివాస్, బి.సుమన్‌రావు, డిప్యూటీ కమిషనర్ కె.నారాయణరావు, ఏఈ బి.మహేందర్, డీఈలు జి.మాధవి, జి.అభినయ్‌కుమార్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్లు ఎ. ప్రత్యూష, ఎబి.రమాదేవి, జి. తేజస్విని, శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఎం.శ్యాంసుందర్, ఇల్లెందు మున్సిపాలిటీకి చెందిన జానియర్ అకౌంట్ ఆఫీసర్ శ్రీనివా్‌సరెడ్డి, టెక్నికల్ ఆఫీసర్ ఎం.బాబు, అప్పటి ఇన్‌చార్జి మున్సిపల్ కమిషనర్ ఎస్‌కే అంకుషావలి ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైస్పీడ్ రైళ్ల మార్గాల పనులను వేగవంతం చేయండి.. కేంద్రానికి సీఎం రేవంత్ విన్నపం
ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడితే ఉపేక్షించం: మంత్రి పొంగులేటి
ఆదిలాబాద్‌కు ఏముఖం పెట్టుకుని వస్తారు.. కేటీఆర్‌పై కవిత ధ్వజం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News