Home » Ramagundam
పండగల సందర్భంలో చర్లపల్లి-దనపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లను నడపడానికి ఏర్పాట్లు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబరు23, 28తేదీల్లో చర్లపల్లి- దనపూర్(07049)రైళ్లు, 24,29 తేదీల్లో దనపూర్-చర్లపల్లి (07092) రైళ్లు, 26న చర్లపల్లి- దనపూర్ (07049), 27న దనపూర్-చర్లపల్లి (07050)ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు అధికారులు వివరించారు.
విధి నిర్వహణలో గుండెపోటుతో మృతి చెందిన కార్మికుడి కుటుంబానికి ఎన్‌టీపీసీ యాజమాన్యం రూ. 1.34 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది.
NTPC Fined: పెద్దపల్లి జిల్లాలో ఎన్టీపీసీకి రామగుండం మున్సిపల్ శాఖ భారీ షాక్ ఇచ్చింది. ఎన్టీపీసీ టౌన్ షిప్‌లో ఆరు చోట్ల అనుమతులు లేకుండా ఎన్టీపీసీ యాజమాన్యం నిర్మాణాలు చేపడుతోంది.
బ్యాంకాక్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ ఎమ్మెల్యే మక్కన్ సింగ్ కుటుంబం క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. పెళ్లికి హాజరు అవ్వడం కోసం మక్కన్ సింగ్ భార్యాబిడ్డలు బ్యాంకాక్ వెళ్లి.. అక్కడ భూకంప విధ్వంసంలో చిక్కుకున్నారు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుని.. క్షేమంగా హైదరాబాద్ చేరుకున్నారు.
రామగుండం ఎన్టీపీసీకి అవార్డుల పంట పండింది. గోవాలో శనివారం జరిగిన అపెక్స్ ఇండియా ఫౌండేషన్ అవార్డుల కార్యక్రమంలో రామగుండం ప్రాజెక్టు అధికారులకు పురస్కారాలను ప్రదానం చేశారు.
రామగుండం మెగా పవర్ ప్లాంట్ల పీపీఏపై ఎన్టీపీసీ ఎన్నిసార్లు లేఖలు రాసినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు.
స్నేహితుల పుట్టినరోజు వేడుక రెండు కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. పార్టీలో భాగంగా కల్లు తెప్పించగా దాన్ని తాగిన ముగ్గురు యువకులూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందారు.
రామగుండంలో జెన్‌కోకు చెందిన ప్లాంట్ ఉన్న స్థలంలో 800 మెగావాట్ల సామర్థ్యంతో సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం కట్టించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ మధ్యంతర నివేదికకు లోబడి మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయాలని ఎల్ అండ్ టీని నీటిపారుదల శాఖ కోరింది. ఈ మేరకు నిర్మాణ సంస్థకు రామగుండం చీఫ్ ఇంజనీర్ లేఖ రాశారు. మేడిగడ్డకు తదుపరి మరమ్మతులు చేయాలంటే కాంపోనెంట్ల వారీగా కొత్తగా ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుందని, ఆ మేరకు చెల్లింపులూ చేయాల్సి ఉంటుందని ఎల్ అండ్ టీ ఇప్పటికే ప్రభుత్వానికి స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
దొడ్డు రకం వడ్లకూ బోనస్ ఇవ్వాలని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలనుఅమలు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. కరీంనగర్‌లో ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్‌లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, మానకొండూర్‌లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదండిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఆసిఫాబాద్‌లో ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు.