Share News

ఖైరతాబాద్‌లో నేత్రపర్వంగా మహాగణపతి ఆగమన్

ABN , Publish Date - Sep 11 , 2026 | 06:37 PM

ఖైరతాబాద్‌లో మహాగణపతి ఆగమన్‌ను శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివచ్చారు.

ఖైరతాబాద్‌లో నేత్రపర్వంగా మహాగణపతి ఆగమన్
Khairatabad Maha Ganapathi

హైదరాబాద్, సెప్టెంబర్ 11 (ఆంధ్రజ్యోతి): ఖైరతాబాద్‌లో మహాగణపతి (Khairatabad Maha Ganapathi) ఆగమన్‌ను ఈ రోజు (శుక్రవారం) అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకను చూడటానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీతో ఖైరతాబాద్ సందడిగా మారింది. మేళతాళాలు, నృత్యాలతో గణనాథుడికి నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. గణేశ్ ఉత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.


మహాగణపతి ఆగమన్‌తో భక్తుల్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. భక్తుల రద్దీ నేపథ్యంలో భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. లంబోదరుడి ఉత్సవాల నేపథ్యంలో ఖైరతాబాద్‌లో పండుగ వాతావరణం సంతరించుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫాంహౌస్‌లో కుట్రపై సమగ్ర విచారణ: సీఎం రేవంత్‌‌రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. సీపీ సజ్జనార్‌కి ఎంపీ మల్లు రవి ఫిర్యాదు

ఎర్రవల్లి ఫాంహౌస్ శుద్ధి ఘటన.. బీఆర్ఎస్ నేతపై కాంగ్రెస్ ఎమ్మెల్యే ఫిర్యాదు

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 11 , 2026 | 07:00 PM