సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు.. సీపీ సజ్జనార్‌కి ఎంపీ మల్లు రవి ఫిర్యాదు
ABN , Publish Date - Sep 09 , 2026 | 02:21 PM
సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (Congress MP Mallu Ravi) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కేటీఆర్‌పై బేగంబజార్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీఎన్‌ఎస్ సెక్షన్ 356, 352 కింద కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. కేటీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అలాగే, హైదరాబాద్ సీపీ సజ్జనార్‌కి ఎంపీ ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్‌పై.. కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలు పరువు నష్టం, అనుచితంగా ఉన్నాయని ఎంపీ ఆరోపించారు. కేటీఆర్‌పై పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేయాలని సీపీ సజ్జనార్‌కి విజ్ఞప్తి చేశారు. సోషల్ మీడియా, మీడియా ఆధారాలను భద్రపరచాలని ఎంపీ మల్లు రవి కోరారు.
అసెంబ్లీ మీద బీఆర్ఎస్ దాడి చేసింది: ఎంపీ మల్లు రవి
బీఆర్ఎస్ సభ్యులు వ్యక్తి ఔన్నత్యాన్ని దెబ్బతీస్తున్నారని ఎంపీ మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా మాజీమంత్రి హరీశ్‌రావు ప్రవర్తన ఉందని ధ్వజమెత్తారు. ఫౌంహౌస్ కేంద్రంగా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా కుట్ర చేస్తున్నారని ఆగ్రహించారు. కావాలనే హరీశ్‌రావు రాష్ట్రపతి పాలన కోరుతున్నారని అన్నారు. బీఆర్ఎస్ సభ్యులు ఒకరు స్పీకర్‌ను తిడతారని, మరోకరెమో సీఎంను తిడతారని దుయ్యబట్టారు. ఇంకొకరు పోలీసులతో అసభ్యంగా వ్యవహరిస్తారని మండిపడ్డారు. మహిళా కానిస్టేబుళ్లతో బీఆర్ఎస్ సభ్యులు అసభ్యంగా ప్రవర్తించారని ధ్వజమెత్తారు. అసెంబ్లీ మీద బీఆర్ఎస్ దాడి చేసిందని అన్నారు. ప్రశ్నించడం వేరు, తిట్టడం వేరని చెప్పారు. అందుకే మాజీ మంత్రి కేటీఆర్‌పై బేగంబజార్ పోలీస్ స్టేషన్‌లో తాను ఫిర్యాదు చేశానని ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం.. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు: కేటీఆర్
శాసన మండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ సస్పెన్షన్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై ఏకపక్షంగా నిర్ణయం తీసుకునే ఆలోచన మాకు లేదు: స్పీకర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News